WhatsApp | సరికొత్త ఫీచర్‌ను తెస్తున్న వాట్సాప్‌..! ఇక హెచ్‌డీ క్వాలిటీ వీడియోలు కూడా సెండ్‌ చేయొచ్చు..!

WhatsApp | ప్రముఖ మెస్సేజింగ్‌ ప్లాట్‌ఫామ్‌ వాట్సాప్‌ ఎప్పటికప్పుడు యూజర్లకు కొత్త కొత్త ఫీచర్లను పరిచయం చేస్తుంటుంది. ఇప్పటికే ఎన్నో సరికొత్త ఫీచర్స్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఎక్కువగా ఫొటోలు, వీడియోలు షేరింగ్‌ చేసుకునే వారి కోసం శుభవార్తను చెప్పింది. హై క్వాలిటీ ఫొటోలు, వీడియో షేరింగ్‌పై పని చేస్తున్నది. త్వరలోనే అందుబాటులోకి రానుందని WaBetaInfo పేర్కొంది. ప్రస్తుతం ఇప్పటికే కొంతమంతి బీటా టెస్టర్లకు అందుబాటులో ఉందని తెలిపింది. వాట్సాప్ బీటా అప్‌డేట్‌ 2.23.14.10లో హై-క్వాలిటీ వీడియోలను పంపగల […]

WhatsApp | సరికొత్త ఫీచర్‌ను తెస్తున్న వాట్సాప్‌..! ఇక హెచ్‌డీ క్వాలిటీ వీడియోలు కూడా సెండ్‌ చేయొచ్చు..!

WhatsApp |

ప్రముఖ మెస్సేజింగ్‌ ప్లాట్‌ఫామ్‌ వాట్సాప్‌ ఎప్పటికప్పుడు యూజర్లకు కొత్త కొత్త ఫీచర్లను పరిచయం చేస్తుంటుంది. ఇప్పటికే ఎన్నో సరికొత్త ఫీచర్స్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఎక్కువగా ఫొటోలు, వీడియోలు షేరింగ్‌ చేసుకునే వారి కోసం శుభవార్తను చెప్పింది.

హై క్వాలిటీ ఫొటోలు, వీడియో షేరింగ్‌పై పని చేస్తున్నది. త్వరలోనే అందుబాటులోకి రానుందని WaBetaInfo పేర్కొంది. ప్రస్తుతం ఇప్పటికే కొంతమంతి బీటా టెస్టర్లకు అందుబాటులో ఉందని తెలిపింది. వాట్సాప్ బీటా అప్‌డేట్‌ 2.23.14.10లో హై-క్వాలిటీ వీడియోలను పంపగల సామర్థ్యాన్ని సైతం పరిచయం చేస్తోంది.

వాట్సాప్ ట్రాకర్ వాట్సాప్ బీటా ఇన్ఫో (WABetaInfo) ప్రకారం.. వాట్సాప్ డ్రాయింగ్ ఎడిటర్‌లో ఓ కొత్తగా బటన్‌ను జోడించింది. దీంతో యూజర్లు హై క్వాలిటీ వీడియోలను వాట్సాప్ ద్వారా నేరుగా పంపించుకునే సౌలభ్యం ఉంటుంది.

ఫీచర్ అందుబాటులోకి వస్తే వీడియో ఒరిజినల్ డైమెన్షన్లను 99శాతం అలానే ఉంచుతూ ఇతరులకు పంపేందుకు అవకాశం ఉంటుంది. అయితే, వీడియో లైట్ కంప్రెషన్‌కు గురవుతుంది. హై క్వాలిటీ ఫొటోస్ ఫీచర్‌తో కూడా యూజర్లు ఒరిజినల్ డైమెన్షన్లతో క్వాలిటీ ఫొటోలను షేర్ చేసుకునే అవకాశం ఉంది.

ఈ ఆప్షన్‌తో ఫొటో సెండ్ చేసినప్పుడు, మెసేజ్ బబుల్‌లో హెచ్‌డీ అనే ఓ ట్యాగ్‌ కనిపిస్తుంది. తద్వారా అది హై క్వాలిటీ ఫొటోగా గుర్తించడం సాధ్యమవుతుంది. ఈ ట్యాగ్ వీడియోల మెసేజ్ బబుల్‌లో కూడా కనిపించడాన్ని లేటెస్ట్ ఆండ్రాయిడ్ వాట్సాప్ బీటా టెస్టర్లు గుర్తించారు.

యూజర్లు హెచ్‌డీ క్వాలిటీ ఆప్షన్‌ను ఉపయోగించి వీడియోను షేర్ చేసినప్పుడు.. అది కన్వర్జేషన్‌లో హెచ్‌డీ వీడియోగా లేబుల్ అయి కనిపిస్తుంది. హై-క్వాలిటీ ఫొటోల మాదిరిగానే, వీడియో మెసేజ్ బబుల్‌కు ట్యాగ్ ఆటోమేటిక్‌గా అనుసంధానమవుతుంది.

ఇది వీడియో మెరుగైన క్వాలిటీతో సెండ్ అయినట్లు సూచిస్తుంది. అయితే, స్టేటస్ ద్వారా హై క్వాలిటీ వీడియోలను షేర్ చేసేందుకు మాత్రం అవకాశం లేదు. ప్రస్తుతం బీటా టెస్టర్లకు అందుబాటులో ఉండగా.. విజయవంతమైతే యూజర్లందరికీ అందుబాటులోకి రానున్నది.