Google Pay | సరికొత్త ఫీచర్‌ను తీసుకొచ్చిన గూగుల్‌ పే..! అదేంటో తెలిస్తే వావ్‌ అంటారు..!

Google Pay | బ్యాకింగ్‌ రంగంలో విప్లవాత్మక మార్పులు వస్తున్నాయి. దాంతో డిజిటల్‌ పేమెంట్స్‌ భారీగా పెరుగుతున్నాయి. కరోనా మహమ్మారి తర్వాత నగదు చలామణి తగ్గి.. డిజిటల్‌ లావాదేవీలు మరింత ఎక్కువయ్యాయి. గూగుల్‌ పే, పేటీఎం, ఫోన్‌ పేతో పాటు పలు యూపీఐ సర్వీసులతో లావాదేవీలు జరుపుతున్నారు. వేలల్లో లేదంటే లక్షల్లో మాత్రమే లావాదేవీలు జరిపేందుకు బ్యాంకులకు వెళుతున్నారు. చిన్న చిన్న లావాదేవీలకు మాత్రమం ఆన్‌లైన్‌ పేమెంట్స్‌ ఫ్లాట్‌ఫామ్‌ను వినియోగిస్తున్నారు. వినియోగదారుల అవసరాలను దృష్టిలో పెట్టుకొని ఎప్పటికప్పుడు సంస్థలు […]

Google Pay | సరికొత్త ఫీచర్‌ను తీసుకొచ్చిన గూగుల్‌ పే..! అదేంటో తెలిస్తే వావ్‌ అంటారు..!

Google Pay |

బ్యాకింగ్‌ రంగంలో విప్లవాత్మక మార్పులు వస్తున్నాయి. దాంతో డిజిటల్‌ పేమెంట్స్‌ భారీగా పెరుగుతున్నాయి. కరోనా మహమ్మారి తర్వాత నగదు చలామణి తగ్గి.. డిజిటల్‌ లావాదేవీలు మరింత ఎక్కువయ్యాయి. గూగుల్‌ పే, పేటీఎం, ఫోన్‌ పేతో పాటు పలు యూపీఐ సర్వీసులతో లావాదేవీలు జరుపుతున్నారు.

వేలల్లో లేదంటే లక్షల్లో మాత్రమే లావాదేవీలు జరిపేందుకు బ్యాంకులకు వెళుతున్నారు. చిన్న చిన్న లావాదేవీలకు మాత్రమం ఆన్‌లైన్‌ పేమెంట్స్‌ ఫ్లాట్‌ఫామ్‌ను వినియోగిస్తున్నారు. వినియోగదారుల అవసరాలను దృష్టిలో పెట్టుకొని ఎప్పటికప్పుడు సంస్థలు సరికొత్త ఫీచర్స్‌ను పరిచయం చేస్తున్నాయి.

తాజాగా గూగుల్‌ పే సైతం (Google Pay) నయా ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ ఫీచర్‌ సహాయంతో గ్రూప్‌ సభ్యులు చెల్లించాల్సిన పేమెంట్స్‌ను చాలా సులువుగా చేస్తుంది. ఉదాహరణకు నెలకు రూ.50వేల బిల్లును ఆరుగురు వ్యక్తులు సమానంగా చెల్లించాల్సి ఉందనుకోండి. ఈ సమయంలో ఈ ఫీచర్‌ ఎంతో సహాయ పడుతుంది.

బిల్లు మొత్తాన్ని ఆరుగురు వ్యక్తులకు సరి సమానంగా పంచి.. ఎవరు ఎంత చెల్లించాలో లెక్కించి చూపిస్తుంది. దాంతో పాటు వారు చెల్లించేలా రిమైండర్‌ సైతం పంపుతుంది. వాట్సా్ప్‌ గ్రూప్‌లో ఎలా క్రియేట్ చేసుకుంటామో అలాగే గూగుల్‌ పేలోనూ గ్రూప్‌ను సైతం క్రియేట్‌ చేసుకొని.. పేమెంట్స్‌ రిసీవ్‌ చేసుకోవచ్చు.

గ్రూప్‌ను క్రియేట్‌ చేసుకోవాలంటే.. మొదట గూగుల్‌ పే(Google Pay) ఓపెన్‌ చేయాలి. ఆ తర్వాత మెయిన్‌ పేజీలో గూగుల పే కాంటాక్ట్స్‌ ఆప్షన్‌ను ఎంచుకోవాలి. కొత్త స్క్రీన్ ఓపెన్ అయ్యాక కింది భాగంలో న్యూ గ్రూప్ అనే ఆప్షన్ ఉంటుంది. దాన్ని ఓపెన్‌ చేసి.. ఇందులో ఎవరి పేర్లు అయితే కావాలనుకుంటున్నారో వారి పేర్లను ఎంచుకోవాలి.

అనంతరం స్క్రీన్‌లో ఆ గ్రూపునకు ఓ పేరు పెట్టి క్రియేట్ చేసుకోవాలి. ఆ తర్వాత కింద కనిపించే స్ల్పిట్‌ యాన్ ఎక్స్‌పెన్స్‌ బటన్‌పై క్లిక్ చేసి గ్రూపు సభ్యులు చెల్లించాల్సిన అమౌంట్‌ను ఎంటర్‌ చేయాలి. ఆటోమెటిక్‌గా గ్రూప్‌లో ఎంత మంది సభ్యులు ఉంటే.. అందరికీ సమానంగా ఈ ఫీచర్‌ పంచి.. రిక్వెస్ట్ బటన్ నొక్కితే పేమెంట్ ప్రోగ్రెస్‌ని గ్రూప్ మెయిన్ స్క్రీన్ నుంచి ట్రాక్ చేయవచ్చు. అంతేకాకుండా గ్రూపులో ఉండే సభ్యుడు చెల్లించాల్సిన మొత్తానికి సంబంధించి సభ్యుడికి రిమైండర్‌ను సైతం పంపుతుంది.