ఆగస్ట్ 1 నుంచి UPI కొత్త నిబంధనలు

యునిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్(యూపీఐ)లో కొత్త నిబంధనలను నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఇండియా రేపటి నుంచి (ఆగష్టు,1,205) అమలు చేయనుంది

ఆగస్ట్ 1 నుంచి UPI కొత్త నిబంధనలు

విధాత: యునిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్(UPI)లో కొత్త నిబంధనలను నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఇండియా  ఆగష్టు, 1, 2025 నుంచి అమలు చేయనుంది. ట్రాన్జాక్షన్ స్టేటస్, బ్యాలెన్స్ ఎంక్వైరీకి సంబంధించిన ఇంటర్ ఫేస్‌ను మరింత పటిష్టంగా చేసేందుకు NPCI లక్ష్యంగా పెట్టుకుంది. గూగుల్ పే, ఫోన్‌పే, పేటీఎం వంటి యూపీఐ యాప్స్‌లో పేమెట్స్‌కు సంబంధించిన పర్ఫామెన్స్‌ను మెరుగుపరచనున్నట్లు NPCI గత ఏప్రిల్ 26న వెల్లడించింది.

UPI సేవల్లో చేసిన ముఖ్యమైన మార్పులు

UPI యాప్‌లో రోజుకు 50 సార్లు మాత్రమే బ్యాలెన్స్ చెక్ చేసుకోవచ్చు. వేరే వేరే యాప్స్ వినియోగించే వారు ప్రతి యాప్‌లో 50 సార్లు చెక్ చేసుకోవచ్చు. అలాగే ట్రాన్సాక్షన్ స్టేటస్ చెక్ లిమిట్ విషయంలో రోజుకు కేవలం మూడు సార్లు మాత్రమే చెక్ చేసుకోవచ్చు అన్నమాట. ఆటోపే టైమింగ్స్ విషయంలో కీలక మార్పులు చోటు చేసుకోనున్నాయి. ఆటోపేకు సంబంధించిన లావాదేవీలు ఉదయం.10 గంటల నుంచి మద్యాహ్నం.1 గంట ఆ తర్వాత సాయంత్రం.5 గంటల నుంచి రాత్రి.9.30 గంటల మధ్య జరగనున్నాయి. UPI యాప్స్‌కు లింక్ చేసిన బ్యాంకుల జాబితాను ఇక నుంచి రోజుకు 25 సార్లు మాత్రమే చెక్ చేసుకోవచ్చు. అలాగే పేమెంట్ రివర్సల్ రిక్వెస్ట్‌లు నెలకు పది మాత్రమే చేసుకోవచ్చు. వీటితోపాటు తప్పలు, మోసాలు జరగకుండా ఉండేందుకు పేమెంట్ పొందవాల్సిన వ్యక్తి రిజిస్టర్ చేసుకున్న బ్యాంకు పేరు పేమెంట్ చేసే వ్యక్తికి ముందుగానే కనిపిస్తుంది.

UPI యాప్స్,బ్యాంకుల API వినియోగాన్ని NPCI ఎప్పటికప్పుడూ పరిశీలిస్తుంటుందని, NPCI నిబంధనలు పాటించని బ్యాంకులు, UPI యాప్స్‌పై తగిన చర్యలు తీసుకుటుందని హెచ్చరించింది. UPI వినియోగంలో వేరే దేశాలతో పోల్చుకుంటే భారత్ చాలా వేగంగా చెల్లింపులు చేస్తోందని ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్(IMF) కొనియాడింది. అలాగే డెబిట్ కార్డులు, క్రెడిట్ కార్డులు, నగదు వినియోగం తగ్గినట్లు పేర్కొంది. 2016 నుంచి మొదలైన UPI సేవల వినియోగంలో భారత్‌ చాలా వేగంగా ముందుకు దూసుకుపోయిందని, నెలకు 18 బిలియన్ల ట్రాన్సాక్షన్‌లు UPI ద్వారానే చేస్తుండటం కాక ఇతర ఎలక్ట్రానిక్ రిటైల్ పేమెంట్లను డామినేట్ చేస్తున్నట్లు వెల్లడించింది.