Nalgonda | నల్గొండ జిల్లాలో 18లక్షల గంజాయి పట్టివేత.. ముగ్గురి అరెస్టు

అక్రమ గంజాయి తరలిస్తున్న ముగ్గురు వ్యక్తులను నల్గొండ పోలీసులు అరెస్ట్‌ చేశారు. నిందితుల వద్ద నుంచి 89ప్యాకెట్లలో 73.825 కేజీల గంజాయి, 5 సెల్ ఫోన్లు, ఓ కారును స్వాధీనం చేసుకున్నారు.

Nalgonda | నల్గొండ జిల్లాలో 18లక్షల గంజాయి పట్టివేత.. ముగ్గురి అరెస్టు

విధాత, హైదరాబాద్ : అక్రమ గంజాయి తరలిస్తున్న ముగ్గురు వ్యక్తులను నల్గొండ పోలీసులు అరెస్ట్‌ చేశారు. నిందితుల వద్ద నుంచి 89ప్యాకెట్లలో 73.825 కేజీల గంజాయి, 5 సెల్ ఫోన్లు, ఓ కారును స్వాధీనం చేసుకున్నారు. నల్గొండ డీఎస్పీ శివరాం రెడ్డి ఇందుకు వివరాలను మీడియాకు వెల్లడించారు. తెలంగాణలో డ్రగ్స్ నిర్మూలన ప్రత్యేక డ్రైవ్‌లో భాగంగా పోలీసులు ముమ్మర తనిఖీలు చేపట్టినట్టు ఆయన పేర్కొన్నారు. విజయవాడ-హైదరాబాద్ జాతీయ రహదారి గుండా గంజాయి తరలిస్తున్నారనే సమాచారం మేరకు కొర్లపహాడ్ చెక్ పోస్ట్ వద్ద వాహనాలు తనిఖీ చేసినట్లు తెలిపారు. ఉత్తర ప్రదేశ్ రాష్ట్రానికి చెందిన కారు సూర్యాపేట వైపు నుంచి హైదరాబాద్‌కు వెలుతుండగా, తనిఖీ చేయగా గంజాయి పట్టుబడిందని తెలిపారు.

ఉత్తరప్రదేశ్‌కు చెందిన ప్రేమ్‌సింగ్ ఒడిశాలోని మల్కన్‌గిరి కలిమెల వెళ్లి అక్కడ సుశాంత్ వద్ద నుంచి 89ప్యాకెట్ల గంజాయి కొనుగలు చేసి, కారులో హైదరాబాద్‌కు తరలిస్తుండగా పట్టుకున్నామని తెలిపారు. పట్టుబడిన గంజాయి విలువ రూ. 18లక్షల 45,625గా ఉంటుందన్నారు. గంజాయితో పట్టుబడిన ఉత్తరప్రదేశ్‌కు చెందిన అశోక్‌కుమార్‌, దీపుకుమార్‌, సుష్మరాయ్‌లను అరెస్టు చేశామని పేర్కోన్నారు. ఫ్రేమ్‌సింగ్‌, సుశాంత్‌లు పరారీలో ఉన్నారన్నారు. గంజాయిని, నేరస్తులను పట్టుకున్న శాలిగౌరరం సీఐ కె. కొండల్ రెడ్డి, కేతేపల్లి ఎస్‌ఐ ఏ. శివ తేజ, సిబ్బందిని, జిల్లా టాస్క్ ఫోర్స్ సీఐ రమేశ్ బాబు, ఎస్‌ఐ లు మహేందర్, మహేశ్, సిబ్బంది ప్రభాకర్, కొండల్, లక్ష్మి ప్రసాద్, శ్రీను, లింగరాజు, గిరిలను ఎస్పీ అభినందించారని తెలిపారు.