ఏఐ సిటీ కోసం 200ఎకరాలు: మంత్రి శ్రీధర్‌బాబు వెల్లడి
విధాత : తెలంగాణలో అర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ సిటీ కోసం 200ఎకరాలు కేటాయించామని రాష్ట్ర ఐటీ వ్యవహారాల శాఖ మంత్రి డి.శ్రీధర్‌బాబు ప్రకటించారు. గురువారం సైబర్ టవర్స్‌లో పీఎస్ఆర్ గ్లోబల్ డెలివరీ సెంటర్ టెక్ హబ్‌ను మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జులైలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సదస్సు నిర్వహిస్తామని వెల్లడించారు. ఈ రంగంలో విస్తృత పరిశోధనలు, ఆవిష్కరణలను ప్రోత్సహిస్తామని చెప్పారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రాకతో సాఫ్ట్‌వేర్ రంగం రూపురేఖలు సమూలంగా మారాయని, భవిష్యత్‌లో ఈ రంగంలో అపారమైన అవకాశాలు ఉంటాయని శ్రీధర్ బాబు అన్నారు. ప్రస్తుతం దేశంలో సాఫ్ట్‌వేర్ రంగంలో రెండో స్థానంలో ఉన్న హైదరాబాద్‌ను మొదటి ర్యాంకుకు తీసుకెళ్లడమే తమ ప్రధాన లక్ష్యమని తెలిపారు. సాఫ్ట్‌వేర్ పరిశ్రమను రాష్ట్రమంతా విస్తరింపజేసేందుకు ఐటీ సంస్థలు సహకరించాలన్నారు. స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు చేసి పరిశ్రమ అవసరాలు తీరుస్తామన్నారు.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram