TS Lok Sabha Elections | తెలంగాణలో మ. ఒంటి గంట వరకు 40.13 శాతం పోలింగ్ నమోదు
తెలంగాణలో మధ్యాహ్నం ఒంటి గంట వరకు 40.13 శాతం పోలింగ్ నమోదైంది. ఓటర్లు పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరారు.
హైదరాబాద్ : తెలంగాణలో మధ్యాహ్నం ఒంటి గంట వరకు 40.13 శాతం పోలింగ్ నమోదైంది. ఓటర్లు పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరారు. ఉత్సాహంగా ఓటర్లు పోలింగ్ ప్రక్రియలో పాల్గొంటున్నారు. ఎండలను ఓటర్లు లెక్క చేయకుండా తమ ఓటు హక్కును వినియోగించుకుని, భారీగా పోలింగ్ శాతాన్ని నమోదు చేస్తున్నారు. అత్యధికంగా జహీరాబాద్ నియోజకవర్గంలో 50.71 శాతం పోలింగ్ నమోదు కాగా, అత్యల్పంగా హైదరాబాద్ నియోజకవర్గంలో 19.37 శాతం పోలింగ్ నమోదైంది.
ఆదిలాబాద్ పార్లమెంట్ పరిధిలో 50.18 శాతం, భువనగిరిలో 46.49 శాతం, చేవెళ్లలో 34.56 శాతం, హైదరాబాద్‌లో 19.37 శాతం, కరీంనగర్‌లో 45.11 శాతం, ఖమ్మంలో 50.63 శాతం, మహబూబాబాద్‌లో 48.81 శాతం, మహబూబ్‌నగర్‌లో 45.84 శాతం, మల్కాజ్‌గిరిలో 27.69 శాతం, మెదక్‌లో 46.72 శాతం, నాగర్‌కర్నూల్‌లో 45.88 శాతం, నల్లగొండలో 48.48 శాతం, నిజామాబాద్‌లో 45.67 శాతం, పెద్దపల్లిలో 44.87 శాతం, సికింద్రాబాద్‌లో 24.91 శాతం, వరంగల్‌లో 41.23 శాతం, జహీరాబాద్‌లో 50.71 శాతం పోలింగ్ నమోదైంది.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram