Screwdriver | బాలుడి పెద్దపేగులో అడ్డంగా ఇరుక్కున్న స్క్రూ డ్రైవర్.. తొలగించిన వైద్యులు
screwdriver | ఓ ఏడేండ్ల బాలుడు( Boy ) ఆడుకుంటూ ఆడుకుంటూ ఓ స్క్రూ డ్రైవర్( screwdriver )ను మింగాడు. పెద్దపేగులో అడ్డంగా ఇరుక్కున్న ఆ స్క్రూడ్రైవర్‌ను సర్జరీ చేసి తొలగించారు వైద్యులు( Doctors ).

screwdriver | హైదరాబాద్ : ఓ ఏడేండ్ల బాలుడు( Boy ) ఆడుకుంటూ ఆడుకుంటూ ఓ స్క్రూ డ్రైవర్( screwdriver )ను మింగాడు. పెద్దపేగులో అడ్డంగా ఇరుక్కున్న ఆ స్క్రూడ్రైవర్‌ను సర్జరీ చేసి తొలగించారు వైద్యులు( Doctors ).
వివరాల్లోకి వెళ్తే.. ఆంధ్రప్రదేశ్( Andhra Pradesh ) అల్లూరి సీతారామరాజు జిల్లాకు చెందిన ఓ ఏడేండ్ల బాలుడు ఇంట్లోనే ఆడుకుంటున్నాడు. ఇక తన ఆట వస్తువుల్లో కలిసిపోయిన స్క్రూ డ్రైవర్( screwdriver )ను మింగేశాడు. మొదట బాలుడికి ఎలాంటి ప్రమాదం సంభవించలేదు. కానీ ఆందోళనకు గురైన తల్లిదండ్రులు అతడిని భద్రాచలం( Bhadrachalam ) ఏరియా ఆస్పత్రికి తరలించారు.
బాధిత బాలుడికి డాక్టర్లు ఎక్స్ రే( X Ray ) తీయగా.. పెద్ద పేగులో స్క్రూ డ్రైవర్ అడ్డంగా ఇరుక్కుపోయినట్లు గుర్తించారు. మొదట మలం ద్వారా బయటకు తీసుకొచ్చేందుకు యత్నించారు. కానీ సాయంత్రానికి బాలుడు తీవ్రమైన కడుపునొప్పితో బాధపడడం, ఆకస్మాత్తుగా వాంతులు కావడంతో వైద్యులు అప్రమత్తమయ్యారు.
ఏ మాత్రం ఆలస్యం చేయకుండా బాలుడిని ఆపరేషన్ థియేటర్‌కు తరలించారు. మూడు గంటల పాటు సర్జరీ నిర్వహించి స్క్రూ డ్రైవర్‌ను తొలగించారు. ఈ వస్తువు ఆరు సెంటిమీటర్లు ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ప్రస్తుతం బాలుడి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు స్పష్టం చేశారు. బాలుడు బతికి బయటపడడంతో తల్లిదండ్రులు ఊపిరి పీల్చుకున్నారు.