Hyderabad | ఒకే బైక్‌పై న‌లుగురు ప్ర‌యాణం.. దానిపై 21 చ‌లాన్లు పెండింగ్

Hyderabad | హైద‌రాబాద్ : న‌గ‌రంలో కొంద‌రు యువ‌కులు విచ్చ‌ల‌విడిగా బైక్‌ల‌ను( Bikes ) న‌డుపుతుంటారు. ట్రాఫిక్ నిబంధ‌న‌ల‌కు విరుద్ధంగా బైక్ రైడింగ్( Bike Riding ) చేస్తుంటారు. ఓ న‌లుగురు యువ‌కులు క‌లిసి ఒకే బైక్‌పై ప్ర‌యాణిస్తూ ట్రాఫిక్ పోలీసుల‌కు( Traffic Police ) అడ్డంగా దొరికిపోయారు.

Hyderabad | ఒకే బైక్‌పై న‌లుగురు ప్ర‌యాణం.. దానిపై 21 చ‌లాన్లు పెండింగ్

Hyderabad | హైద‌రాబాద్ : న‌గ‌రంలో కొంద‌రు యువ‌కులు విచ్చ‌ల‌విడిగా బైక్‌ల‌ను( Bikes ) న‌డుపుతుంటారు. ట్రాఫిక్ నిబంధ‌న‌ల‌కు విరుద్ధంగా బైక్ రైడింగ్( Bike Riding ) చేస్తుంటారు. ఓ న‌లుగురు యువ‌కులు క‌లిసి ఒకే బైక్‌పై ప్ర‌యాణిస్తూ ట్రాఫిక్ పోలీసుల‌కు( Traffic Police ) అడ్డంగా దొరికిపోయారు. పోలీసులు వారిని ఆపి బైక్‌ను సీజ్ చేశారు. మ‌రి ఆ బైక్‌పై ఎన్ని చ‌లాన్లు పెండింగ్‌లో ఉన్నాయో తెలుసా..? ఒక‌ట్రెండు కాదు ఏకంగా 21 చ‌లాన్లు పెండింగ్‌లో ఉన్నాయి.

శుక్రవారం సాయంత్రము 6 గంటల సమయంలో ఎల్బీనగర్( LB Nagar ) ఫ్లైఓవర్ వద్ద ట్రాఫిక్ సీఐ వెంక‌టేశ్వ‌ర్లు ఆధ్వ‌ర్యంలో పోలీసులు వాహనాలను తనిఖీ( Vehicle Checking ) చేస్తున్నారు. అదే సమయంలో ఓ న‌లుగురు విద్యార్థులు క‌లిసి ఒకే బైక్‌పై ప్ర‌యాణిస్తూ పోలీసుల‌కు అడ్డంగా దొరికిపోయారు. అది కూడా బైక‌ర్ హెల్మెట్( Helmet ) లేకుండా వాహ‌నాన్ని న‌డుపుతున్నాడు. వీరి బైక్‌ను పోలీసులు సీజ్ చేశారు. సదరు బైకుపై 2014 సంవత్సరం నుండి ఇప్పటివరకు 21 చలాన్లు.. రూ. 9860/- ల జరిమానాలు పెండింగ్లో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.

ఒకే బైకుపై ప్రయాణిస్తున్న నలుగురు వాసవి కాలేజీకి చెందిన విద్యార్థులుగా పోలీసుల విచార‌ణ‌లో తేలింది. వీరిలో బీటెక్ థ‌ర్డ్ ఇయ‌ర్ చ‌దువుతున్న త‌రుణ్ బైక్ న‌డుపుతుండ‌గా.. అతని ముగ్గురు మిత్రులు వెనుకాల‌ కూర్చున్నారు. ఎల్బీనగర్ నుండి చింతలకుంట వైపు ప్రమాదకరంగా ప్రయాణం చేస్తూ పోలీసుల కంట ప‌డ్డారు.