విధాత : తప్ప తాగి పాఠశాలకు వస్తున్న ప్రభుత్వ ఉపాధ్యాయుడి నిర్వాకం సర్కారీ విద్యా వ్యవస్థ దుస్థితిని చాటింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకపల్లి మండలం తిమ్మంపేట గ్రామ పంచాయితీలో ఉన్న ప్రాథమిక పాఠశాలలో ఎస్జీటీ టీచరుగా పనిచేస్తున్న పత్తిపాటి వీరయ్య ప్రతిరోజూ మద్యం తాగి పాఠశాలకు రావడం అలవాటుగా మారింది. ఈ క్రమంలో పొద్దున్నే ఫుల్లుగా తాగి నడవలేని స్థితిలో పాఠశాలకు వచ్చి స్కూల్ బయటే పడిపోయాడు. స్పృహలో లేని స్థానికులు అతడిని గమనించి పక్కనే ఉన్న పశువుల కొట్టంలోకి తీసుకెళ్ళి పడుకోబెట్టారు. వీరయ్య మీద చర్యలు ఎందుకు తీసుకోవడం లేదని స్థానికులు ప్రశ్నించగా, అతడు పాఠశాలకు లేటుగా వచ్చాడు కాబట్టి క్యాజువల్ లీవ్ వేశాం అని స్థానిక హెడ్ మాస్టర్ కిరణ్ చెప్పుకొచ్చాడు. ఒకవైపు సీఎం రేవంత్‌రెడ్డి ప్రభుత్వం పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పిస్తామని, ఉపాధ్యాయ ఖాళీలు భర్తీ చేస్తామని, ప్రైవేటు రంగానికి ధీటుగా ప్రభుత్వ బడులను తీర్చిదిద్దుతామని చెబుతుండగా, క్షేత్ర స్థాయిలో అందుకు భిన్నమైన పరిస్థితులున్నాయన్న వాదనకు వీరయ్య ఘటన నిదర్శనంగా నిలిచింది.
తప్పతాగి పాఠశాలకు వస్తున్న ప్రభుత్వ ఉపాధ్యాయుడు … మత్తులో స్కూల్ బయటే పడిపోయిన వైనం
తప్ప తాగి పాఠశాలకు వస్తున్న ప్రభుత్వ ఉపాధ్యాయుడి నిర్వాకం సర్కారీ విద్యా వ్యవస్థ దుస్థితిని చాటింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకపల్లి మండలం తిమ్మంపేట గ్రామ పంచాయితీలో ఉన్న ప్రాథమిక పాఠశాలలో ఎస్జీటీ టీచరుగా పనిచేస్తున్న పత్తిపాటి వీరయ్య ప్రతిరోజూ మద్యం తాగి పాఠశాలకు రావడం అలవాటుగా మారింది

Latest News
‘మిస్టర్ మిడిల్ క్లాస్’ అందరికీ కనెక్ట్ అవుతున్న పక్కా ఫ్యామిలీ ఎంటర్టైనర్!
గోదావరి పుష్కరాలలోపే భద్రాద్రికి నూతన వైభవం: మంత్రి పొంగులేటి
వచ్చే మూడు నెలలకు ఒకేసారి రేషన్ : కేంద్రం కీలక నిర్ణయం
హాస్టల్ మెస్‌లోకి మొసలి.. అంతా పరుగో పరుగు!
సర్ పూర్తయ్యే వరకు గాంధీభవన్ రావద్దు : సీఎం రేవంత్ రెడ్డి
మా భూములకు కాదు… మా బతుకులకే కంచె వేస్తున్నారు !
జపాన్ ఓపెన్ టైటిల్ విజేత పీ.వీ.సింధు
పక్కా స్కెచ్..నార్వార్ కోటలో 400ఏళ్ల నాటి ఫిరంగి దోపిడీ !
వానల కోసం గాడిదలకు పెళ్లి!
స్థిరంగా బంగారం, వెండి ధరలు