Hyderabad | వీడు మగాడ్రా బుజ్జి.. భార్య పుస్తెల తాడునే దొంగిలించిన భర్త
Hyderabad | డబ్బులకు( Money ) కక్కుర్తి పడ్డ ఓ భర్త( Husband ).. భార్య( Wife ) మెడలోని పుస్తెల తాడును దొంగిలించాడు. ఇక తనకేమి తెలియదన్నట్టు నా భార్య మెడలో ఉన్న బంగారు గొలుసును( Gold Chain ) ఎవరో దొంగిలించారని నాటకమాడాడు. కానీ చివరకు పోలీసులకు( Police ) చిక్కాడు ఆ దొంగ మొగుడు.

Hyderabad | హైదరాబాద్ : డబ్బులకు( Money ) కక్కుర్తి పడ్డ ఓ భర్త( Husband ).. భార్య( Wife ) మెడలోని పుస్తెల తాడును దొంగిలించాడు. ఇక తనకేమి తెలియదన్నట్టు నా భార్య మెడలో ఉన్న బంగారు గొలుసును( Gold Chain ) ఎవరో దొంగిలించారని నాటకమాడాడు. కానీ చివరకు పోలీసులకు( Police ) చిక్కాడు ఆ దొంగ మొగుడు.
వివరాల్లోకి వెళ్తే.. మెదక్ జిల్లా వల్లూరు గ్రామానికి చెందిన ఆంజనేయులు, భాగ్యమ్మ దంపతులు కేపీహెచ్‌బీలోని వసంత నగర్ రోడ్డు నంబర్ 6లో నివాసం ఉంటున్నారు. భార్యభర్తలిద్దరూ స్థానికంగా ఉన్న ఓ భవనంలో వాచ్‌మెన్‌గా పని చేస్తున్నారు.
అయితే మంగళవారం తెల్లవారుజామున భాగ్యమ్మ మెడలో నుంచి బంగారం గొలుసును దొంగ వచ్చి అపహరించాడని ఆంజనేయులు ఆ భవనం యజమానికి సమాచారం అందించాడు. ఆ యజమాని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ క్రమంలో పోలీసులు ఆ భవనం వద్దకు వచ్చి విచారణ ప్రారంభించారు. మంగళవారం తెల్లవారుజామున భవనం వద్దకు ఎవరూ రాలేదని పోలీసులు నిర్ధారించుకున్నారు.
ఇక ఆంజనేయులు మీదనే పోలీసులకు అనుమానం కలిగింది. దీంతో ఆయనను పోలీసులు లోతుగా విచారించారు. భార్య భాగ్యమ్మ నిద్రిస్తుండగానే తానే పుస్తెల తాడు తెంచానని ఆంజనేయులు అంగీకరించాడు. వ్యక్తిగతంగా డబ్బు అవసరం ఉండి తాళి చోరీ చేయాల్సి వచ్చిందని తెలిపాడు. ఆంజనేయులను పోలీసులు రిమాండ్‌కు తరలించారు.