కాళోజి ఆరోగ్య విశ్వా విద్యాలయంలో ఎంబీబీఎస్, బీడీఎస్ కన్వీనర కోటా ప్రవేశాలకు నోటిఫికేషన్ జారీ

రాష్ట్రం లోని ఎంబీబీఎస్, బీడీఎస్ ప్రవేశాలకు గాను ఆన్ లైన్ దరఖాస్తుల నమోదుకు కాళోజి నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం నోటిఫికేషన్ విడుదల చేసింది.

కాళోజి ఆరోగ్య విశ్వా విద్యాలయంలో ఎంబీబీఎస్, బీడీఎస్ కన్వీనర కోటా ప్రవేశాలకు నోటిఫికేషన్ జారీ

ఈ నెల 4 నుండి 13 వ తేది వరకు ఆన్లైన్ లో దరఖాస్తులు

ప్రవేశాలకు ప్రకటన విడుదల చేసిన కాళోజి ఆరోగ్య విశ్వా విద్యాలయం

రాష్ట్రం లోని ఎంబీబీఎస్, బీడీఎస్ ప్రవేశాలకు గాను ఆన్ లైన్ దరఖాస్తుల నమోదుకు కాళోజి నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా యూనివర్సిటీ పరిధిలోని వైద్య దంత కళాశాలల్లోని కన్వీనర కోటా సీట్లను భర్తీ చేయనున్నారు. జాతీయ స్థాయి అర్హత పరీక్ష నీట్ 2024 లో అర్హత సాధించిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ నెల 04వ తేదీ ఉదయం 6 గంటల నుండి 13 వ తేదీ సాయింత్రం 6 గంటల వరకు అభ్యర్థులు ఆన్ లైన్ లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలని వారు సూచించారు. నిర్ధేశిత ధరఖాస్తు పూర్తి చేయడంతో పాటు అభ్యర్థులు సంబంధిత సర్టిఫికెట్లను స్కాన్ చేసి వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. ఆన్‌లైన్ లో సమర్పించిన దరఖాస్తులు , సర్టిఫికెట్లను యూనివర్సిటీ పరిశీలించిన అనంతరం తుది మెరిట్ జాబితాను విడుదల చేస్తారు. ప్రవేశాలకు సంబంధించి అర్హత ఇతర సమాచారానికి యూనివర్సిటీ వెబ్ సైట్లోwww.knruhs.telangana.gov.in సందర్శించాలని యూనివర్సిటీ వర్గాలు ఒక ప్రకటనలో తెలిపారు.