Hyderabad | ‘నర్సరీ’ ఫీజు అక్షరాలా.. రూ. 2,51,000.. హైదరాబాద్‌లో ఓ కార్పొరేట్ స్కూల్ దోపిడీ ఇదీ..!
Hyderabad | చదువు చారెడు... బలపాలు దోసెడు అన్న చందంగా కార్పొరేట్ స్కూళ్ల( Corporate School ) తీరు ఉంది. విద్యా వ్యాపారం అయిపోయిందనడానికి ఈ ఒక్క ఉదాహరణ చాలు. కార్పొరేట్ స్కూళ్ల భారీ ఫీజులతో మధ్య తరగతి కుటుంబాల పిల్లలకు కార్పొరేట్ విద్య అందని ద్రాక్షగానే మిగిలిపోయింది. వేలల్లో కాదు లక్షల్లో ఫీజుల్లో వసూలు చేస్తూ.. విద్యా వ్యవస్థను వ్యాపారంగా మార్చేస్తున్నాయి కొన్ని ప్రయివేటు స్కూల్స్( Private Schools ).

Hyderabad | మన హైదరాబాద్( Hyderabad ) నగరం నడిబొడ్డున ఉన్న ఓ ప్రయివేటు స్కూల్( Private Schhol ).. ఎవరూ ఊహించని విధంగా భారీగా ఫీజులను పెంచేసింది. కేవలం నర్సరీ( Nursery ) చదువుకునే విద్యార్థికి ఏడాదికి రూ. 2,51,000గా నిర్ధారించింది. ట్యూషన్ ఫీజు( Tution Fee ) కింద రూ. 47,750, అడ్మిషన్ ఫీజు రూ. 5 వేలు, ఇన్సియేషన్ ఫీజు రూ. 11,250, కాషన్ డిపాజిట్ కింద రూ. 10 వేలు(రిఫండబుల్) వసూలు చేస్తున్నారు. ఇలా ఫస్ట్ ఇన్‌స్టాల్‌మెంట్ కింద రూ. రూ. 74 వేలు వసూలు చేస్తున్నారు. రెండు, మూడు, నాలుగు ఇన్‌స్టాల్‌మెంట్ల కింద ట్యూషన్ ఫీజు రూ. 47,750, ఇన్సియేషన్ ఫీజు రూ. 11,250.. ఇలా రూ. 59 వేల చొప్పున వసూలు చేస్తున్నారు. అంటే మొత్తం ఫీజు కలిపితే ఏడాదికి రూ. 2,51,000 వసూలు చేస్తున్నారు.
క్లాస్ పీపీ1, పీపీ2 కింద ఏడాదికి రూ. 2,72,400, క్లాస్ ఫస్ట్, సెకండ్ కింద రూ. 2,91,460, క్లాస్ థర్డ్ నుంచి ఐదో తరగతి వరకు రూ. 3,22,350 వసూలు చేస్తున్నారు. ఈ ఫీజులకు సంబంధించిన వివరాలను ఇండియా ధర్మపార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు అనురాధ తివారీ( Anuradha Tiwari ) తన ఎక్స్ ఖాతాలో షేర్ చేశారు. ఈ ఫీజులను చూస్తుంటే.. ప్రతి నెల రూ. 21 చెల్లించి ఏబీసీడీలు కొనుగోలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందని వ్యంగ్యంగా పేర్కొన్నారు తివారీ. ఈ స్థాయిలో ఫీజులు వసూలు చేసేందుకు టీచర్లు ఏం బోధిస్తున్నారని ప్రశ్నించారు.
ఈ కార్పొరేట్ స్కూల్ ఫీజులపై నెటిజన్లు మండిపడుతున్నారు. దేశంలో కొత్త ఎడ్యుకేషన్ పాలసీ( Education Policy ) తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉందని నెటిజన్లు అంటున్నారు. దేశం మొత్తం ఒకే ఎడ్యుకేషన్ పాలసీ ఉండాలని, దీన్ని కఠినంగా అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ నర్సరీ ఫీజులను చూస్తుంటే తమ జీవితకాలంలో కూడా చదువుకు ఇంత ఖర్చు పెట్టలేదని కొందరు పేర్కొంటున్నారు.
Class- Nursery
Fees – Rs 2,51,000/-Now, learning ABCD will cost you Rs 21,000 per month.
What are these schools even teaching to justify such a ridiculously high fee? pic.twitter.com/DkWOVC28Qs
— Anuradha Tiwari (@talk2anuradha) July 30, 2025