మజ్లీస్ ఎంపీ ఒవైసీ జిమ్ కసరత్తులు..వైరల్ గా వీడియో!

హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ జిమ్ వర్కౌట్ వీడియో వైరల్. 57 ఏళ్ల వయసులోనూ ఫిట్‌నెస్‌లో యువతకు ఆదర్శం

మజ్లీస్ ఎంపీ ఒవైసీ జిమ్ కసరత్తులు..వైరల్ గా వీడియో!

విధాత, హైదరాబాద్ : ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ జిమ్ లో చేసిన ఫిట్నెస్ కసరత్తుల వీడియో వైరల్ గా మారింది. బహదూర్‌పురా ఫిట్‌నెస్‌ స్టూడియోను ప్రారంభించిన ఒవైసీ ఈ సందర్భంగా జిమ్ లో కాసేపు ఎక్సైర్ సైజ్ చేశారు. బరువులు ఎత్తి..డంబెల్స్ ..పుషప్స్ కొట్టి ఫిట్నెస్ లో తనెంతో ఫిట్ గా ఉన్నాడో చాటి చెప్పారు. 1969మే 13న జన్మించిన ఒవైసీ 57ఏళ్ల వయసులోనూ యువతతో పోటీపడి చేసిన జిమ్ కసరత్తులు ఫిట్నెస్ విషయంలో యువతకు ఆదర్శంగా నిలిచాయి.

ఎంఐఎం అధినేతగా తన వర్గం ప్రయోజనాల పరిరక్షణకు తరుచు తీవ్ర స్థాయిలో గళమెత్తే ఒవైసీ..ఇటీవల పహల్గామ్ ఉగ్రదాడి.. ఆపరేషన్ సిందూర్ సందర్భంగా దాయాది దేశం పాక్ కు వ్యతిరేకంగా గళమెత్తి తన దేశభక్తిని గొప్పగా చాటుకుని తన విమర్శకుల నోళ్లు మూయించడంలో పైచేయి సాధించారు.