గులాబ్ తుఫాన్ దృష్ట్యా అప్ర‌మ‌త్త‌మైన హైద‌రాబాద్

విధాత‌: బంగాళాఖాతంలో ఏర్పడిన ‘గులాబ్’ తుఫాన్ దృష్ట్యా రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం హైఅలర్ట్ అయింది. నేడు, రేపు జీహెచ్ఎంసీ హైఅలర్ట్ ప్రకటించింది. గులాబ్‌ తుఫాను ప్రభావంతో రాష్ట్రంలో సోమవారం, మంగళవారం భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. దీంతో లోతట్టు ప్రాంతాల్లో అప్రమత్తంగా ఉండేలా అధికారుల చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం ఆదేశించింది. తుఫాన్ నేపథ్యంలో హైదరాబాద్‌లో కంట్రోల్ రూమ్ కూడా ఏర్పాటు చేసింది. అత్యవసర పరిస్థితుల్లో ప్రజలు కంట్రోల్‌ రూమ్ 040-23202813 నంబర్లకు ఫిర్యాదు చేయాలని […]

గులాబ్ తుఫాన్ దృష్ట్యా అప్ర‌మ‌త్త‌మైన హైద‌రాబాద్

విధాత‌: బంగాళాఖాతంలో ఏర్పడిన ‘గులాబ్’ తుఫాన్ దృష్ట్యా రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం హైఅలర్ట్ అయింది. నేడు, రేపు జీహెచ్ఎంసీ హైఅలర్ట్ ప్రకటించింది. గులాబ్‌ తుఫాను ప్రభావంతో రాష్ట్రంలో సోమవారం, మంగళవారం భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. దీంతో లోతట్టు ప్రాంతాల్లో అప్రమత్తంగా ఉండేలా అధికారుల చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం ఆదేశించింది. తుఫాన్ నేపథ్యంలో హైదరాబాద్‌లో కంట్రోల్ రూమ్ కూడా ఏర్పాటు చేసింది. అత్యవసర పరిస్థితుల్లో ప్రజలు కంట్రోల్‌ రూమ్ 040-23202813 నంబర్లకు ఫిర్యాదు చేయాలని సూచించారు.