Amrapali | టాకీసులకు, మాల్స్​కు ఆమ్రపాలి షాక్​..!

గ్రేటర్​ హైదరాబాద్​ మునిసిపల్​ కమిషనర్ ఆమ్రపాలి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. హైదరాబాద్​కు కమిషనర్ గా బాధ్యతలు చేపట్టగానే తనదైన పనితీరును ప్రదర్శిస్తోంది.

Amrapali | టాకీసులకు, మాల్స్​కు ఆమ్రపాలి షాక్​..!

గ్రేటర్​ హైదరాబాద్​ మునిసిపల్​ కమిషనర్ ఆమ్రపాలి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. హైదరాబాద్​కు కమిషనర్ గా బాధ్యతలు చేపట్టగానే తనదైన పనితీరును ప్రదర్శిస్తోంది. తనకిదేం కొత్త కాదు. ఫీల్డ్​ మీద సడెన్​ అటాక్​తో అధికారులకు చెమటలు పట్టిస్తోంది. ఎప్పుడు, ఎక్కడ ప్రత్యక్షమవుతుందో ఎవరికీ తెలియదు. ఇప్పుడు కొత్తగా హైదరాబాద్​లోని సినిమా థియేటర్​లకు, షాపింగ్​ మాళ్లకు పెద్ద షాక్​ ఇచ్చి, ప్రజలను సంభ్రమాశ్చర్యాలకు గురిచేసింది.

నగరంలోని పారిశుద్ధ్య నిర్వహణపై జిహెచ్​ఎంసీ కమీషనర్(GHMS Commissioner)​ ఆమ్రపాలి(Amrapali Kata) చాలా సీరియస్​గా దృష్టి సారించింది. అసలే వానాకాలం. దోమలు విపరీతంగా విజృంభించే సమయం. దోమలు గుడ్లు పెట్టి, పిల్లలను పొదిగే అనుకూల వాతావరణం. దానికి సహాయపడే చోట్లను గుర్తించి(హాట్​స్పాట్లు), వెంటనే నిర్మూలించాల్సిందిగా అధికారులను ఆదేశించింది. అంతేకాదు, సాధారణ అమ్మాయిలా టీషర్ట్​, జీన్స్​లో ఈ మధ్య ఆకస్మిక తనిఖీలు (Random Checks) నిర్వహిస్తూ, అధికారులను పరుగులు పెట్టిస్తోంది. దార్లో కనబడే యువతీయువకులు, విద్యార్థులతో మాట్లాడుతూ, సమస్యలను తెలుసుకుంటోంది. ఈ క్రమంలోనే, వారి ద్వారా తెలుసుకున్న ఓ దోపిడీపై కన్నేసింది ఆమ్రపాలి. హైదరాబాద్ నగరంలోని ప్రధాన సమస్య అయిన పార్కింగ్ ఇబ్బందుల(Parking issues)పై అమ్రపాలి కీలక ఆదేశాలను జారీ చేశారు.

నగరంలో వాహనదారులకు నిత్యం ట్రాఫిక్ సమస్యతో పాటు పార్కింగ్ సమస్య అనేది కూడా ఎక్కువగా వేధిస్తుంటుంది. ముఖ్యంగా ఈ పార్కింగ్ పేరుతో థియేటర్లు(Cinema Theatres), షాపింగ్​ మాల్స్(Shopping Malls)​ విచ్చలవిడిగా దోపిడీ చేస్తున్నాయి. ఈ క్రమంలోనే ఆ దోపిడీదారులపై కమిషనర్ ఆమ్రపాలి దృష్టి సారించింది. పార్కింగ్ పేరిట ఫీజుల(Parking Fees) వసూళ్లను నియంత్రించే దిశగా అడుగులు వేసి, ఈ విషయంపై జీవో-63ని కఠినంగా అమలు చేయాలని అధికారులకు జీహెచ్ఎంసీ కమిషనర్ ఆదేశాలు జారీ చేసింది.

నిబంధనలు అతిక్రమించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని శాసించింది. అందుకోసం నగరంలోని అన్ని సర్కిళ్లలో అధికార బృందాలు ముమ్మరంగా తనిఖీలు నిర్వహించి, ఈ తరహా దోపిడీని అరికట్టాలని ఆమె అధికారులకు గట్టిగా చెప్పింది. ముఖ్యంగా ఏ షాపింగ్ మాల్​లో అయినా, కమర్షియల్ కాంప్లెక్స్‌లో అయినా, వాహనాన్ని పార్క్ చేస్తే, మొదటి అర్థగంట వరకు ఎలాంటి ఫీజు వసూలు చేయవద్దని ఆమ్రపాలి సూచించింది (అంటే, బండి అక్కడ పార్క్​ చేసి, బయట వేరే పని చూసుకుని అర్థగంటలోపు వచ్చేవారికి). అంతేకాకుండా, ఆయా టాకీసుల, షాపింగ్ మాల్స్ , కాంప్లెక్స్​​ల బిల్లులు గానీ, సినిమా టికెట్లు గానీ ఉంటే, వారి దగ్గర ఎలాంటి పార్కింగ్ ఫీజులు తీసుకోవద్దని(No parking fees for customers with bills or tickets) ఆమ్రపాలి విస్పష్టంగా ఆదేశించింది.

అలాగే మరో వైపు పార్కింగ్ ఫీజు ఎంత వసూలు చేస్తున్నారన్నది కూడా వినియోగదారులకు కనిపించేలా ప్రతి మల్టీఫ్లెక్స్ , థియేటర్లలో డిస్​ప్లే బోర్డు(Parking Fee Display Boards)లు ఏర్పాటు చేయాలని కూడా ఆమ్రపాలి ఆయా థియేటర్లు, మాల్స్​ యాజమాన్యానికి చెప్పాల్సిందిగా అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. ఈ చర్యతో నగరవాసులు కొంత ఉపశమనం పొందుతారనడంలో సందేహం లేదు. అదే చేత్తో, సినిమా హాళ్లలోని క్యాంటీన్​(Theatre Canteens)లలో తినుభండారాల(Snacks) నాణ్యత, ధరల(Quality and Rates)ను పరిశీలించి, వాటిని కూడా ఓ కొలిక్కి తేవాలని ప్రజలు కమీషనర్​ను కోరుతున్నారు.