Danakishore | మూసీ రివర్ డెవలప్ మెంట్ కార్పోరేషన్ ఎండీగా దానకిషోర్

పలువురు ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ మంగళవారం రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. జీహెచ్ ఎంసీ కమిషనర్ అమ్రపాలిని హెచ్ ఎండే జాయింట్ కమిషనర్ గా రిలీవ్ చేసింది.

Danakishore | మూసీ రివర్ డెవలప్ మెంట్ కార్పోరేషన్ ఎండీగా దానకిషోర్

పలువురు ఐఏ ఎస్ అధికారుల బదిలీ

విధాత: పలువురు ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ మంగళవారం రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. జీహెచ్ ఎంసీ కమిషనర్ అమ్రపాలిని హెచ్ ఎండే జాయింట్ కమిషనర్ గా రిలీవ్ చేసింది. పురపాలక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ దానకిషోర్ కు మూసీ రివర్ డెవలప్ మెంట్ కార్పోరేషన్ ఎండీగా నియమించింది. హెచ్ ఎండీ ఏ కమిషన్ సర్పరాజ్ అహ్మద్ను హైదరాబాద్ గ్రోత్ కారిడార్ ఎండీ గా నియమించింది. వెయింటింగ్ లో ఉన్న ఛా హట్ బాజ్ పాల్ ను కరీంనగర్ మున్సిపల్ కార్పోరేషన్ కమిషనర్ గా నియమించింది. నారాయణ పేట అడిషన్ కలెక్టర్ (లోకల్ బాడీస్) మయాంక్ మిట్టల్ ను బదిలీ చేసి జలమండలి ఎక్జిక్యూటీవ్ డైరెక్టర్ గా నియమించింది.