Nizam College | నిజాం కాలేజీలో పార్ట్ టైమ్ లెక్చ‌రర్ల పోస్టుల‌కు ద‌ర‌ఖాస్తుల ఆహ్వానం

Nizam College | మీరు లెక్చ‌ర‌ర్ ఉద్యోగం( Lecturer Job ) కోసం ఎదురుచూస్తున్నారా..? నెట్/ స్లెట్ /ఎంఫీల్/ పీహెచ్‌డీ పూర్తి చేశారా..? అయితే ఆల‌స్య‌మెందుకు.. ఎంతో చారిత్రాత్మ‌క నేప‌థ్యం క‌లిగిన నిజాం కళాశాల( Nizam College ).. పార్ట్ టైమ్ లెక్చ‌ర‌ర్ల( Part Time Lecturers ) పోస్టుల‌కు ద‌ర‌ఖాస్తుల‌ను ఆహ్వానిస్తోంది. మ‌రి అర్హ‌త‌లు, ఇత‌ర వివ‌రాలు తెలుసుకుందాం..

Nizam College | నిజాం కాలేజీలో పార్ట్ టైమ్ లెక్చ‌రర్ల పోస్టుల‌కు ద‌ర‌ఖాస్తుల ఆహ్వానం

Nizam College | హైద‌రాబాద్ : ఉస్మానియా యూనివ‌ర్సిటీ( Osmania University ) అనుబంధ క‌ళాశాల నిజాం కాలేజీ( Nizam College )లో పార్ట్ టైమ్ లెక్చ‌రర్ల( Part Time Lecturers ) పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌లైంది. ఈ మేర‌కు అర్హ‌త క‌లిగిన అభ్య‌ర్థుల నుంచి ఈ నెల 11వ తేదీ వ‌ర‌కు ద‌ర‌ఖాస్తుల‌ను ఆహ్వానించ‌నున్న‌ట్లు నిజాం కాలేజీ ప్రిన్సిపాల్( Nizam College Principal ) ఏవీ రాజశేఖ‌ర్ ఒక ప్ర‌క‌ట‌న‌లో తెలిపారు. యూజీ, పీజీ కోర్సుల‌కు సంబంధించి బోధించాల్సి ఉంటుంద‌ని పేర్కొన్నారు.

అర్హ‌త :

ఎంఏ, ఎంకామ్‌, ఎమ్మెస్సీ, ఎంసీఏ, ఎంబీఏ పూర్తి చేసి ఉండాలి. క‌నీసం 55 శాతం మార్కుల‌తో ఉత్తీర్ణ‌త సాధించి ఉన్న వారికే ప్రాధాన్య‌త ఇవ్వ‌నున్నారు.

గ‌మ‌నిక :

పార్ట్ టైమ్ లెక్చ‌ర‌ర్ పోస్టుల‌కు ద‌ర‌ఖాస్తు చేసుకునే అభ్య‌ర్థులు త‌ప్పనిస‌రిగా నెట్/ స్లెట్ /ఎంఫీల్/ పీహెచ్‌డీ.. వీటిలో ఏదో ఒక‌టి క‌చ్చితంగా పొంది ఉండాలి. బోధనా అనుభ‌వం త‌ప్ప‌నిస‌రి. ఉస్మానియా యూనివ‌ర్సిటీ నిబంధ‌న‌ల ప్ర‌కారం అభ్య‌ర్థుల ఎంపిక జ‌ర‌గ‌నుంది.

పోస్టులు భ‌ర్తీ చేప‌ట్టే విభాగాలు ఇవే..

1. ఇంగ్లీష్
2. సంస్కృతం
3. కంప్యూట‌ర్ సైన్స్
4. కామ‌ర్స్
5. ఎకాన‌మిక్స్
6. జెనిటిక్స్
7. బ‌యో టెక్నాల‌జీ
8. బిజినెస్ మేనేజ్‌మెంట్
9. పొలిటిక‌ల్ సైన్స్
10. కెమిస్ట్రీ( ఆర్గానిక్ /ఫిజిక‌ల్ అండ్ ఫార్మాకో ఇన్‌ఫార్మ‌టిక్స్)
11. మ్యాథ‌మేటిక్స్
12. స్టాట‌టిక్స్