ప్రచారంలో ఎంఐఎం దూకుడు.. అభ్యర్థుల విజయం కోసం ఒవైసీ ప్రచారం

విధాత: అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులతో పాటు మ్యానిఫెస్టోను ప్రకటించి జోష్ మీదున్న ఎంఐఎం చీప్ ఒవైసీ ప్రచార పర్వంలోనూ దూకుడు పెంచారు. నాంపల్లి అభ్యర్థి మజిద్ హుస్సెన్ తో కలిసి ఆయనను గెలిపించాలని కోరుతూ పతంగి గుర్తుకు ఓటేయాలని స్వయంగా అసదుద్ధిన్ ఒవైసీ రంగంలోకి దిగి నియోజకవర్గంలోని మల్లెపల్లి డివిజన్‌లో ఇంటింటి ప్రచారం సాగించారు.

కాగా.. తమ అధినేత అసద్ ఎన్నికల ప్రచారంలో దిగడంతో ఆ పార్టీ శ్రేణులు ఉత్సాహంగా గల్లీల్లో ఇంటింటి ప్రచారం కొనసాగిస్తున్నాయి. అసద్ ప్రచార సందడితో ఎంఐఎం అభ్యర్థుల ప్రచారంలో జోష్ పెరుగడంతో మిగతా పార్టీలు కూడా తమ ప్రచార జోష్ పెంచే పనిలో పడ్డారు.