పోలీసులు 15 నిమిషాలు పక్కకు జరిగితే తామేం చేయగలమో చూపిస్తామని అక్బరుద్దీన్ గతంలో చేసిన వ్యాఖ్యలపై ఎంపీ నవనీత్ కౌర్ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో అసదుద్ధిన్కు, ఆమెకు మధ్య మాటల తూటాలు పేలాయి.
విధాత, హైదరాబాద్ : పోలీసులు 15 నిమిషాలు పక్కకు జరిగితే తామేం చేయగలమో చూపిస్తామని అక్బరుద్దీన్ గతంలో చేసిన వ్యాఖ్యలపై ఎంపీ నవనీత్ కౌర్ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో అసదుద్ధిన్కు, ఆమెకు మధ్య మాటల తూటాలు పేలాయి. 15 నిమిషాలు పోలీసులు తప్పుకుంటే మేమేంటో చూపిస్తామని చిన్నోడు (అక్బరుద్దీన్) చెప్పాడని, చిన్నోడికి నేను చెబుతున్నా 15 నిమిషాలు ఎందుకు.. మాకైతే 15 సెకన్లు చాలు అని, మీరు ఎక్కడి నుంచి వచ్చారో.. ఎక్కడికి వెళ్లిపోతారో మీకే తెలియదని నవనీత్ కౌర్ ఘాటు వ్యాఖ్యలు చేశారు.
హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవిలత గెలుపు కోసం నవనీత్ కౌర్ ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో హైదరాబాద్ మరో పాకిస్తాన్ కాకుండా మాధవీలతను గెలిపించాలని నవనీత్ కౌర్ కోరారు. హిందువులపై అక్బరుద్ధిన్ గతంలో చేసి వ్యాఖ్యలను ప్రస్తావించిన నవనీత్ కౌర్ పోలీసులు పక్కకు తప్పుకుంటే మాకు 15సెకన్లు చాలంటూ వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలపై గురువారం ఎంఐఎం చీఫ్, ఆ పార్టీ ఎంపీ అభ్యర్థి అసదుద్దీన్ ఒవైసీ కౌంటర్ ఇచ్చారు. 15 సెకన్లు కాదు గంట సమయం తీసుకోండని, అధికారం మీ చేతుల్లోనే ఉందని, మీరు ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తామని, ముస్లింలను ఏం చేస్తారో చేయండని సవాల్ విసిరారు.