క్యూట్ గా ఉన్నావు..మీటవుతావా!: మాజీ మినిస్టర్ పై అథ్లెట్ సంచలన ఆరోపణలు!

అంతర్జాతీయ స్థాయిలో పథకాలు సాధిస్తే ప్రశంసించడంపోయి...క్యూట్ గా ఉన్నావు..మీటవుతావా అంటూ అడగడంతో తాను బీఆర్ఎస్ ప్రభుత్వంలోని క్రీడా మంత్రికి వార్నింగ్ ఇవ్వాల్సి వచ్చిందని తెలంగాణ క్రీడాకారిణి తక్కళ్లపల్లి ప్రతిభ తన ఇంటర్వ్యూలో వెలడించడం వైరల్ అవుతుంది. “రెండు నిమిషాల్లో నీ బాడీలో ఏ పార్ట్ పని చేయకుండా చేస్తా” అని అప్పటి క్రీడా మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్ కి వార్నింగ్ ఇచ్చానని ఆమె చెప్పుకొచ్చారు.

విధాత, హైదరాబాద్ : అంతర్జాతీయ అథ్లెట్, తెలంగాణ క్రీడాకారిణి తక్కడపల్లి ప్రతిభ మాజీ క్రీడా శాఖ మంత్రిపై చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో సంచలనంగా మారాయి. తాను జీవితంలో, క్రీడారంగంలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నానని, పొలిటికల్ గా గత బీఆర్ఎస్ ప్రభుత్వంలోని క్రీడా మంత్రికి గట్టిగా వార్నింగ్ ఇవ్వాల్సిన పరిస్థితి ఎదురైందని ఓ ఛానెల్ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు.

అంతర్జాతీయ స్థాయిలో పథకాలు సాధిస్తే ప్రశంసించడంపోయి…క్యూట్ గా ఉన్నావు..మీటవుతావా అంటూ అడగడంతో తాను అప్పటి క్రీడా మంత్రికి వార్నింగ్ ఇవ్వాల్సి వచ్చిందని ప్రతిభ తన ఇంటర్వ్యూలో వెలడించడం వైరల్ అవుతుంది. “రెండు నిమిషాల్లో నీ బాడీలో ఏ పార్ట్ పని చేయకుండా చేస్తా” అని అప్పటి క్రీడా మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్ కి వార్నింగ్ ఇచ్చానని ఆమె చెప్పుకొచ్చారు.

దీంతో బీఆర్ఎస్ ప్రభుత్వంలో క్రీడాకారులను ఎలా చూసుకున్నారో అర్థం చేసుకోవచ్చంటూ ప్రత్యర్థి పార్టీలు ప్రతిభ వీడియోను వైరల్ చేస్తున్నాయి. ఆటను ప్రోత్సహించడం వేరు..ఆటగాళ్లతో ఆడుకోవడం వేరంటూ విమర్శలు గుప్పిస్తున్నారు. ప్రతిభ వీడియో చూసిన నెటిజన్లు ఆమెకు ఎదురైన ఇబ్బందికర పరిస్థితిపై దిగ్బ్రాంతి వ్యక్తం చేస్తున్నారు.

ప్రతిభా వీడియో వైరల్ కావడంతో..దీనిపై బీఆర్ఎస్ ప్రభుత్వంలో క్రీడాశాఖ మంత్రిగా పనిచేసిన శ్రీనివాస్ గౌడ్ రియాక్షన్ ఏమిటన్నది ఆసక్తికరంగా మారింది.

 

Latest News