మరో వీడియో విడుదల చేసిన అథ్లెట్ తక్కళ్ల పల్లి ప్రతిభ

హైదరాబాద్ : తనపై వేధింపులకు సంబంధించి ఓ ఇంటర్య్యూలో బీఆర్ఎస్ మాజీ మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్ పై తీవ్ర ఆరోపణలు చేసిన అంతర్జాతీయ అథ్లెట్, తెలంగాణ క్రీడాకారిణి తక్కళ్లపల్లి ప్రతిభ..తను గతంలో ఎదుర్కోన్న వేధింపులకు సంబంధించి మరింత వివరణతో వీడియో విడుదల చేసింది.

విధాత, హైదరాబాద్ : తనపై వేధింపులకు సంబంధించి ఓ ఇంటర్య్యూలో బీఆర్ఎస్ మాజీ మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్ పై తీవ్ర ఆరోపణలు చేసిన అంతర్జాతీయ అథ్లెట్, తెలంగాణ క్రీడాకారిణి తక్కళ్లపల్లి ప్రతిభ..తను గతంలో ఎదుర్కోన్న వేధింపులకు సంబంధించి మరింత వివరణతో  వీడియో విడుదల చేసింది. 2022లో అప్పటి క్రీడా మంత్రి శ్రీనివాస్ గౌడ్ తనను బెదిరించారని, 2023లో మీడియా ముందుకు వచ్చిన తర్వాత “మీ పేరెంట్స్ ఎక్కడున్నారో తెలుసు” అంటూ బెదిరింపులకు పాల్పడి.. ఫార్చ్యూనర్ కార్లలో మా కుటుంబాన్ని ఫాలో చేయడం జరిగిందని ఆరోపిస్తోంది.

మైనర్ అథ్లెట్ల విషయంలో ఇలాంటి సమస్యలు ఎదురవ్వడంతో వారిలో చాలామంది భయంతో మాట్లాడలేకపోయారని, ఇలాంటి ఒత్తిళ్లు తట్టుకోలేక చాలామంది అథ్లెట్లు కెరీర్ వదిలేశారని ప్రతిభ తన వీడియోలో ఆరోపించింది. 18 సార్లు ఇంటర్నేషనల్ గోల్డ్ మెడలిస్ట్ అయిన తను దేశానికి ప్రాతినిథ్యం వహిస్తూ అంతర్జాతీయంగా దేశ ప్రతిష్ట కోసం ఆడుతుంటే..ఇక్కడ మాత్రం నాతో పాటు పలువురు క్రీడాకారిణీలను బీఆర్ఎస్ మాజీ మంత్రి, పీఏలు వేధించారని ఆమె వెల్లడించారు. మంత్రి హస్తం లేకుండా..అతని పీఏ ఓ అంతర్జాతీయ క్రీడాకారిణిని బెదిరించడం సాధ్యం కాదని ఆమె స్పష్టం చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ గా మారింది.

 

Latest News