ఫోన్ ట్యాపింగ్ కేసు నిందితులకు బెయిల్ తిరస్కరణ

ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులకు నాంపల్లి కోర్టులో చుక్కెదురైంది. నిందితులు మాజీ డీసీపీ రాధాకిషన్‌రావు, ఏసీపీలు భుజంగరావు, తిరుపతన్న, మాజీ డీఎస్పీ ప్రణిత్‌రావులు దాఖలు చేసుకున్న బెయిల్ పిటిషన్‌ను నాంపల్లి కోర్టు కొట్టివేసింది.

ఫోన్ ట్యాపింగ్ కేసు నిందితులకు బెయిల్ తిరస్కరణ

విధాత, హైదరాబాద్ : ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులకు నాంపల్లి కోర్టులో చుక్కెదురైంది. నిందితులు మాజీ డీసీపీ రాధాకిషన్‌రావు, ఏసీపీలు భుజంగరావు, తిరుపతన్న, మాజీ డీఎస్పీ ప్రణిత్‌రావులు దాఖలు చేసుకున్న బెయిల్ పిటిషన్‌ను నాంపల్లి కోర్టు కొట్టివేసింది. రాజకీయ దురుద్దేశంతోనే అరెస్టు చేశారని కేసులో సాక్ష్యాధారాలను కోర్టుకు సమర్పించలేదని, డిఫాల్ట్ బెయిల్ మంజూరు చేయాలని పిటిషనర్ల తరపున న్యాయవాదులు కోర్టుకు వివరించారు. చార్జ్‌షీట్‌ దాఖలు చేసినప్పటికీ ఇంకా నిందితులను విచారించాల్సి ఉన్నందునా.. నిందితులకు బెయిల్ మంజూరు చేయవద్దని పబ్లిక్ ప్రాసిక్యూటర్ వాదించారు. మంగళవారమే వాదనలు ముగిసిపోగా, నిందితుల బెయిల్ పిటిషన్లను కొట్టివేస్తూ న్యాయమూర్తి బుధవారం ఆదేశాలు జారీ చేశారు.