Bandaru Dattatreya | డీఎంహెచ్‌వో అల్లెం అయ్యప్ప అంకితభావానికి ముగ్దులైన బండారు దత్తాత్రేయ
తెలంగాణ ఆరోగ్యశాఖ అధికారుల పనితీరుకు హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ ఫిదా అయ్యారు. శనివారం ఫోన్‌లో పలువురి అధికారులను ఆయన అభినందించి ప్రోత్సహించారు
విధాత, హైదరాబాద్:తెలంగాణ ఆరోగ్యశాఖ అధికారుల పనితీరుకు హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ ఫిదా అయ్యారు. శనివారం ఫోన్‌లో పలువురి అధికారులను ఆయన అభినందించి ప్రోత్సహించారు. డిఎంహెచ్‌ఓ అల్లెం అప్పయ్య అంకితభావంతో కూడిన పనితీరు ను గవర్నరు తెలుసుకు న్నారు. 11 గిరిజన కుటుంబాలకు మందులు, దోమతెరలు, ఇతర నిత్యావసర వస్తువులను పంపిణీ చేసేందుకు ములుగు జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి అల్లెం అప్పయ్య 16 కిలోమీటర్లు కాలినడకన వాజేడు మండలంలోని మారుమూల గ్రామానికి వెళ్లారు. ఈ విషయాన్ని తెలుసుకు ని ఎంతో సంతోషించిన గవర్నర్ డిఎంహెచ్‌ఓ తో ఫోన్‌లో మాట్లాడి, ఆయన విధినిర్వహణను కొనియాడారు. తన అనుభవాన్ని ఈ సందర్భంగా డిఎంహెచ్‌ఓ అప్పయ్య ఫోన్‌లో గవర్నర్ కు వివరించారు.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram