Fish Prasadam | జూన్ 8, 9 తేదీలలో చేప మందు పంపిణీ: బత్తిని సోదరుల వెల్లడి
మృగశిర కార్తె సందర్భంగా ప్రతి ఏడాది హైదరాబాద్‌లోని ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో అందిస్తున్నచేప మందు ప్రసాదం పంపిణీ ఈ ఏడాది

విధాత : మృగశిర కార్తె సందర్భంగా ప్రతి ఏడాది హైదరాబాద్‌లోని ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో అందిస్తున్నచేప మందు ప్రసాదం పంపిణీ ఈ ఏడాది జూన్ 8 ఉదయం 11గంటల నుంచి జూన్ 9వ తేదీ ఉదయం 11 గంటల వరకు జరుగుతుందని బత్తిని కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ ఏడాది మృగశిర కార్తె జూన్ 8న శనివారం ఉదయం పదకొండు గంటలకు ప్రవేశిస్తుందని తెలిపారు. చేప ప్రసాదం పూర్తిగా ఉచితంగా భక్తులకు అందిస్తామని, వివిధ ఫౌండేషన్ల సహకారంతో.. మెడికల్ సర్వీస్, భోజన సౌకర్యం, మంచి నీటి సరఫరా 24 గంటల పాటు ఉచితంగా భక్తులకు ఇస్తామని చెప్పారు.
ఆస్తమా, ఉబ్బసం, దమ్ము, దగ్గు వంటి శ్వాస సంబంధ వ్యాధుల నివారణకు చేప మందు ప్రసాదాన్ని అందిస్తున్నామని పేర్కొన్నారు. చేప ప్రసాదం పంపిణీకి గత ప్రభుత్వాలు అన్ని ఏర్పాట్లు చేసిన విధంగానే.. ఈ ప్రభుత్వాన్నిసైతం తగిన ఏర్పాట్లు చేయాలని కోరారు. చేప ప్రసాదం కోసం వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు.