R Krishnaiah | రాజ్యసభకు ఆర్ కృష్ణయ్య రాజీనామా.. బీజేపీలో చేరేందుకు రంగం సిద్ధం..!!
R Krishnaiah | వైఎస్సార్‌సీపీ( YSRCP )కి ఆర్ కృష్ణయ్య( R Krishnaiah | ) షాకిచ్చారు. ఆ పార్టీ నుంచి రాజ్యసభ( Rajya sabha )కు ఎన్నికైన ఆయన.. ఆ పదవికి రాజీనామా చేశారు. త్వరలోనే ఆర్ కృష్ణయ్య భారతీయ జనతా పార్టీ( BJP )లో చేరుతారని వార్తలు ఊపందుకున్నాయి.

R Krishnaiah | ఆంధ్రప్రదేశ్( Andhra Pradesh )లో అధికారం కోల్పోయిన వైఎస్సార్‌సీపీ( YSRCP ) అధినేత వైఎస్ జగన్( YS Jagan )కు వరుస దెబ్బలు తగులుతున్నాయి. ఇప్పటికే తిరుపతి లడ్డూ( Tirupathi Laddu ) వివాదంలో చిక్కుకున్న జగన్‌కు తాజాగా భారీ షాక్ తగిలింది. వైసీపీ నుంచి రాజ్యసభ( Rajyasabha )కు ఎంపికైన ఆర్ కృష్ణయ్య( R Krishnaiah ).. తన ఎంపీ పదవికి రాజీనామా చేసి జగన్‌కు షాకిచ్చారు. ఆర్ కృష్ణయ్య రాజీనామాను రాజ్యసభ చైర్మన్ క్షణాల్లోనే ఆమోదించారు. ఏపీ నుంచి ఒక రాజ్యసభ పోస్టు ఖాళీ అయిందని చైర్మన్ గెజిట్ కూడా విడుదల చేశారు.
ఈ సందర్భంగా ఆర్ కృష్ణయ్య మాట్లాడుతూ.. వంద బీసీ సంఘాలతో సమావేశమై రాజ్యసభ పదవికి రాజీనామా చేయాలనే నిర్ణయం తీసుకున్నానని స్పష్టం చేశారు. రెండేండ్ల క్రితం కృష్ణయ్య వైసీపీ తరపున రాజ్యసభకు ఎన్నికైన సంగతి తెలిసిందే. అయితే మరో నాలుగేళ్ల పదవీ కాలం ఉండగానే రాజీనామా చేయడం తెలుగు రాష్ట్రాలకు చెందిన సీనియర్ నాయకులకు షాకిచ్చినట్లు అయింది.
ఆర్ కృష్ణయ్య బీజేపీలో చేరబోతున్నారా..?
రాజ్యసభ పదవికి రాజీనామా చేసిన ఆర్ కృష్ణయ్య భారతీయ జనతా పార్టీలో చేరబోతున్నట్లు వార్తలు షికారు చేస్తున్నాయి. గత రెండు మూడు రోజుల నుంచి మీడియాలో కూడా ఈ వార్తలు వినిపిస్తున్నాయి. ఆయన తాజాగా రాజ్యసభకు రాజీనామా చేయడంతో ఆ ఊహాగానాలు నిజమే అయి ఉండొచ్చనే వాదన రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది. బీజేపీ తరపున మళ్లీ రాజ్యసభకు ఎన్నికయ్యేలా హామీ లభించినందున రాజీనామా చేసినట్లుగా తెలుస్తోంది.
రాజ్యసభలో ఎనిమిదికి పడిపోయిన వైసీపీ బలం
రాజ్యసభలో వైఎస్సార్‌సీపీకి ఇటీవలి కాలం వరకూ పదకొండు మందిసభ్యులు ఉండేవారు. ముగ్గురు రాజీనామా చేయడంతో ఆ సంఖ్య ఎనిమదికి పడిపోయింది. కొద్ది రోజుల కిందట మోపిదేవి వెంకట రమణారావు, బీద మస్తాన్ రావు రాజీనామాలు చేశారు. ఇప్పుడు వారి బాటలోనే ఆర్.కృష్ణయ్య వెళ్లారు.
ఉమ్మడి ఏపీలో బీసీ సంఘాల నేతగా పేరు తెచ్చుకున్న ఆర్ కృష్ణయ్య.. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనంతరం తెలుగు దేశం పార్టీలో చేరారు. తెలంగాణ టీడీపీ సీఎం అభ్యర్థిగా ఆర్ కృష్ణయ్యను చంద్రబాబు ప్రకటించారు. ఎల్‌బీ నగర్ నియోజకవర్గం నుంచి కృష్ణయ్యను పోటీ చేయించారు. ఆయన గెలిచినప్పటికీ.. టీడీపీ మాత్రం అధికారం చేజిక్కించుకోలేదు. తెలంగాణ రాష్ట్రంలో రెండోసారి జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీలో చేరి మిర్యాలగూడ నుంచి పోటీ చేసి ఓటమి చవిచూశారు. ఆ తర్వాత వైసీపీ ఆర్ కృష్ణయ్యకు రాజ్యసభ పదవి కట్టబెట్టింది.