Lok Sabha Elections : తెలంగాణలోనూ భారీగా ఓట్ల తేడా?

ఈవీఎంలను ట్యాంపర్‌ చేయడానికి అవకాశాల్లేకపోలేదని, వాటిని వాడకపోవడమే ఉత్తమమని సామాజిక మాధ్యమం ఎక్స్‌ అధినేత ఎలాన్‌మస్క్‌ చేసిన ట్వీట్‌పై దేశంలో రగడ జరుగుతున్నది.

Lok Sabha Elections : తెలంగాణలోనూ భారీగా ఓట్ల తేడా?

పోలైన ఓట్లకు, లెక్కించిన ఓట్ల మధ్య వ్యత్యాసాలు
కనిష్ఠంగా నల్లగొండలో ఒక ఓటు.. 
గరిష్ఠంగా మల్కాజిగిరిలో 3,946
అన్ని నియోజకవర్గాల్లో తప్పిన లెక్కలు

హైదరాబాద్‌: ఈవీఎంలను ట్యాంపర్‌ చేయడానికి అవకాశాల్లేకపోలేదని, వాటిని వాడకపోవడమే ఉత్తమమని సామాజిక మాధ్యమం ఎక్స్‌ అధినేత ఎలాన్‌మస్క్‌ చేసిన ట్వీట్‌పై దేశంలో రగడ జరుగుతున్నది. దీనిపై కాంగ్రెస్‌ నేత రాహుల్‌గాంధీ తదితరులు స్పందించారు. అందుకు పోటీగా బీజేపీ నేత పురందేశ్వరి భారత్‌కు వచ్చి ఈవీఎంలను ట్యాంపర్‌ చేసి చూపాలని మస్క్‌కు సవాలు కూడా విసిరారు.

ఈ సవాళ్లు, ప్రతిసవాళ్లు ఎలా ఉన్నప్పటికీ.. ఇప్పటికే దేశంలోని 140 పోలింగ్‌ కేంద్రాల్లోని ఈవీఎంలలో పోలైన ఓట్లకు, లెక్కించిన ఓట్లకు మధ్య తీవ్ర వ్యత్యాసాలు ఉన్న విషయాన్ని ఇటీవలే వైర్‌ వెబ్‌సైట్‌ ప్రస్తావించింది. అదే తరహాలో రాష్ట్రంలో అన్ని నియోజకవర్గాల్లోనూ పోలైన ఓట్లకు, లెక్కించిన ఓట్లకు మధ్య తేడాలు ఉన్నాయని తెలుస్తున్నది.

మే 25న తొలి ఐదు దశల్లో ఈవీఎంలలో పోలైన ఓట్ల సంఖ్యను కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. ఈ సంఖ్యలో ఎలాంటి మార్పులైనా అసాధ్యమని కుండబద్దలు కొట్టింది. కానీ.. వాస్తవాలు మాత్రం అందుకు భిన్నంగా ఉన్నాయి. పోలైన ఓట్లకు, లెక్కించిన ఓట్లకు తేడాలు కనిపిస్తున్నాయి.

తెలంగాణ విషయానికి వస్తే.. మొత్తం 17 లోక్‌సభ నియోజకవర్గాల్లోనూ వ్యత్యాసాలు ఉండటం గమనార్హం. వీటిలో మెదక్‌, నిజామాబాద్‌లలో పోల్‌ అయిన ఓట్లకంటే లెక్కించిన ఓట్లు ఎక్కువగా ఉన్నాయి. మిగిలినవాటిలో పోలైన ఓట్లకంటే లెక్కించిన ఓట్లు తక్కువగా ఉన్నాయి. ఈవీఎంల ట్యాంపరింగ్‌ అంశాల సంగతి సరే.. ముందు ఈ ఓట్ల తేడా ఎందుకు ఉన్నదో ఎన్నికల సంఘం వివరించాలన్న డిమాండ్లు వినిపిస్తున్నాయి.

 

నియోజకవర్గం పోలైన ఓట్లు లెక్కించిన ఓట్లు తేడా
ఆదిలాబాద్‌ 12,21,553 12,19,982 1,571
భువనగిరి 13,88,680 13,88,579 101
చేవెళ్ల 16,57,107 16,56,178 929
హైదరాబాద్‌ 10,74,827 10,73,544 1,283
కరీంనగర్‌ 13,03,690 13,02,447 1,243
ఖమ్మం 12,41,135 12,40,582 553
మహబూబాబాద్‌ 11,01,030 11,00,480 550
మహబూబ్‌నగర్‌ 12,18,587 12,18,323 264
మల్కాజ్‌గిరి 19,19,131 19,15,185 3,946
మెదక్‌ 13,72,894 13,72,896 -2
నాగర్‌ కర్నూల్‌ 12,07,470 12,05,275 2,195
నల్లగొండ 12,77,137 12,77,136 1
నిజామాబాద్‌ 12,26,133 12,26,215 -82
పెద్దపల్లి 10,83,467 10,82,815 652
సికింద్రాబాద్‌ 10,39,834 10,39,041 793
వరంగల్‌ 12,56,301 12,55,435 866
జహీరాబాద్‌
12,25,049 12,25,027 22