BJP Leader Revelli Raju | తల్లిని కొట్టానన్న మనస్తాపంతో బీజేపీ నేత ఆత్మహత్య
తల్లిని కొట్టిన వీడియో వైరల్ కావడంతో మనస్తాపం చెందిన ఉప్పల్ బీజేపీ నేత రేవల్లి రాజు, సెల్ఫీ వీడియో తీసి బీబీనగర్ పెద్ద చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు.
విధాత: తన తల్లిని కొట్టిన వీడియో వైరల్ కావడంతో ఉప్పల్ బీజేపీ నేత రేవల్లి రాజు మనస్తాపం చెంది ఆత్మహత్యకు పాల్పడ్డాడు.ఆ వీడియో వల్లే చనిపోవాలని నిర్ణయించుకున్నానని సెల్ఫీ వీడియో తీసి మరి.. బీబీనగర్ పెద్ద చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. ప్రపంచంలో తల్లిని కొట్టాలని కోరుకోడని..తన తల్లిపై చేయి చేసుకున్నందుకు నన్ను క్షమించాలంటూ సెల్ఫీ వీడియోలో చెప్పుకొచ్చాడు.
తల్లి తనను మోసం చేసిందన్న బాధలో ఆవేశంతో చేయి చేసుకోవాల్సి వచ్చిందని రెవెల్లి రాజు తెలిపాడు. ఈ ఘటనను నా తమ్ముడి భార్య వీడియో తీసి..నాపై పగతో వైరల్ చేసిందన్నాడు. నా భార్య, పిల్లలు అమాయకులని..నన్ను మోసం చేసినట్లుగా వారిని చేయవద్దంటూ తల్లిని, కుటుంబ సభ్యులను వేడుకున్నాడు. నేను చనిపోయాక నా కుటుంబ సభ్యులకు అండగా ఉండాలని మిత్రులను వేడుకున్నాడు.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram