ACB Raids : ఏసీబీకి చిక్కిన ఇద్దరు ఉద్యోగులు

తెలంగాణ ఏసీబీ దాడుల్లో కరీంనగర్ పంచాయతీ సెక్రటరీ అనీల్ రూ.10 వేలు, తార్నాక సబ్ ఇంజనీర్ సుధాకర్ రెడ్డి రూ.15 వేలు లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు.

ACB Raids : ఏసీబీకి చిక్కిన ఇద్దరు ఉద్యోగులు

విధాత: అవినీతి అధికారులు భరతం పట్టడంలో తెలంగాణ ఏసీబీ వరుసదాడులతో దూసుకపోతుంది. శుక్రవారం కరీంనగర్ జిల్లా గంగాధర మండలం మధురానగర్ పంచాయతీ సెక్రటరీ అనీల్ రూ.10వేలు లంచం సొమ్ముతో ఏసీబీకి చిక్కాడు. ఇందిరమ్మ బిల్లు శాంక్షన్ కోసం పంచాయతీ సెక్రటరీ అనిల్ 10 వేలు డిమాండ్ చేశాడు. మధురానగర్లో ఉండే శ్రీకాంత్ నుంచి 10 వేల రూపాయలను అనీల్ తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. తార్నాక లోని టీజీఎస్పీడీసీఎల్ కార్యాలయంలో జరిపిన ఏసీబీ దాడుల్లో రూ.15వేలు లంచం తీసుకుంటూ లంచం తీసుకుంటూ సబ్ ఇంజనీర్ సుధాకర్ రెడ్డి ఏసీబీకి చిక్కాడు. కొత్త ట్రాన్స్ఫార్మర్ కోసం కాంట్రాక్టర్ నుంచి రూ.15 వేలు డిమాండ్ చేసి..తీసుకుంటుండగా ఏసీబీ డీఎస్పీ శ్రీధర్ ఆధ్వర్యంలో దాడులు నిర్వహించి పట్టుకున్నారు.

నిన్న నల్గొండ జిల్లాలో కూడా ఏసీబీ రైడ్స్లో తహసీల్దార్ పట్టుబడ్డారు. భూమి మ్యుటేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేసేందుకు రూ. 10 లక్షలు డిమాండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేసి.. మొదటి విడత కింద రూ. 2 లక్షలు తీసుకున్న నల్గొండ జిల్లా చిట్యాల తహశీల్దార్ కృష్ణను ఏసీబీ ఆఫీసర్లు రెడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ హ్యాండెడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా పట్టుకున్న సంగతి తెలిసిందే.