Kayadu Lohar : జోష్ మీదున్న కయాదు లోహర్
తమిళ మూవీ 'డ్రాగన్' తో స్పీడ్ పెంచిన నటి కయాదు లోహర్, ప్రస్తుతం తమిళ, మలయాళ, తెలుగు భాషల్లో నాలుగు-ఐదు సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉన్నారు. ఈమె నాని 'ది ప్యారడైజ్'లో నటిస్తున్నారు.

విధాత : తమిళ మూవీ ‘డ్రాగన్’ తో సినీ కెరీర్ లో స్పీడ్ పెంచిన కయాదు లోహర్ ప్రస్తుతం తమిళ, మలయాళ, తెలుగు భాషల్లో నాలుగైదు సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా మారిపోయింది. అతే సమయంలో షాపింగ్ మాల్స్ ఓపెనింగ్ లతోనూ సందడి చేస్తుంది. చైన్నైలో టాటా గ్రూప్ జ్యువెలరీ షాపు ఓపెనింగ్ కు వెళ్లిన కయాదు లోహర్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
అస్సాంలో పుట్టి పూణేలో పెరిగిన కయాదు 2021లో కన్నడ చిత్రంముగిల్ పెటేతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. తర్వాత తెలుగులోనూ ‘అల్లూరి’ అనే మూవీ చేసింది. కానీ పెద్దగా వర్కౌట్ కాలేదు. ప్రస్తుతం ది ప్యారడైజ్ మూవీలో నానితో నటిస్తుంది. విశ్వక్ సేన్ ‘ఫంకీ’లో ఈమెనే హీరోయిన్. డ్యూడ్ లోనూ ఓ పాత్రలో మెరువనుంది. రవితేజా సినిమాలోను ఎంపికైనట్లుగా సమాచారం. తమిళంలో చేసిన ఇదయం మురళి అనే సినిమా విడుదలకు సిద్ధమైంది. పల్లిచట్టంబి, ఎస్టీఆర్ 49నిర్మాణంలో ఉన్నాయి. ఇప్పుడు తమిళంలో విశాల్ సరసన ఛాన్స్ కొట్టేసినట్లు వార్తలొస్తున్నాయి. దర్శకుడు సుందర్.సి-విశాల్ కాంబోలో ఈ ఏడాది ‘మదగజరాజా’ వచ్చిన సంగతి తెలిసిందే.