Fire Breaks Out At Tobacco Factory In AP | భారీ అగ్నిప్రమాదం.. రూ.500 కోట్ల మేర ఆస్తి నష్టం
ప్రకాశం జిల్లా సింగరాయకొండ సమీపంలోని పొగాకు పరిశ్రమలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. షార్ట్ సర్క్యూట్‌తో చెలరేగిన మంటల వల్ల రూ.500 కోట్ల మేర ఆస్తి నష్టం జరిగినట్లు సమాచారం.

అమరావతి : ప్రకాశం జిల్లా సింగరాయకొండ సమీపంలోని పొగాకు పరిశ్రమలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. విద్యుత్ షార్ట్ సర్క్యూట్‌తో మంటలు చెలరేగి పరిశ్రమ మొత్తానికి వ్యాపించాయి. అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఈ ప్రమాదం వల్ల రూ.500 కోట్ల మేర ఆస్తి నష్టం జరిగిందని సమాచారం.
బీకేటీ సంస్థ వద్ద జీపీఐ కంపెనీ అద్దెకు తీసుకుని ఈ పరిశ్రమను నిర్వహిస్తుంది. అగ్ని ప్రమాదంతో పెద్దఎత్తున మంటలు రావడంతో చుట్టుపక్కల ప్రజలు భయాందోళనకు గురయ్యారు. ఒంగోలు డీఎస్పీ రాయపాటి శ్రీనివాసరావు సంఘటన స్థలాన్ని సందర్శించి సహాయక చర్యలు పర్యవేక్షించారు.