ఏటీఎం వాహనంలో డబ్బు దొంగలించిన నిందితుడు ఆత్మహత్య
సంచలనం సృష్టించిన ఒంగోలు దోపిడీ కేసులో ప్రధాన నిందితుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గత గురువారం పట్టపగలే సీఎంఎస్ వాహనంలో నుంచి 66 లక్షలు దోచుకెళ్లారు
బెయిల్‌పై బయటకు వచ్చి ఆదివారం రాత్రి ఆత్మహత్య
విధాత: సంచలనం సృష్టించిన ఒంగోలు దోపిడీ కేసులో ప్రధాన నిందితుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గత గురువారం పట్టపగలే సీఎంఎస్ వాహనంలో నుంచి 66 లక్షలు దోచుకెళ్లారు. ఈ విషయంపై బ్యాంకు అధికారులు ఫిర్యాదు చేయడంతో పోలీసులు ఆ కేసును 24 గంటల్లోపే చేదించారు. ఈ వ్యవహారం వెనక సీఎంఎస్ మాజీ ఉద్యోగి మహేష్ బాబుతో పాటుగా ఒంగోలు బ్రాంచ్ మేనేజర్ ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఆ డబ్బంతా ఓ మర్రిచెట్టు తొర్రలో దాచిపెట్టినట్లు వెల్లడించారు.
ఈ కేసులో మహేష్ బాబుతో పాటుగా రాజశేఖర్, కొండారెడ్డిలను అరెస్ట్ చేసి, రిమాండ్‌కు తరలించారు. అయితే జైలుకు వెళ్లిన మహేష్ బాబు బెయిల్ మీద విడుదలయ్యాడు. బయటకు వచ్చిన మహేష్ బాబు ఇంటి వద్దనే ఉంటున్నాడు. ఆదివారం రాత్రి ఇంట్లోనే ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. సోమవారం తెల్లవారుజామున ఈ విషయాన్ని గుర్తించిన కుటుంబసభ్యులు పోలీసులకు తెలిపారు. దొంగతనం ఘటన కారణంగానే అవమానంతో ఆత్మ చేసుకున్నట్లు అతని కుటుంబ సభ్యులు వెల్లడించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram