గాంధీభవన్ ముట్టడికి బీజెవైఎం యత్నం.. అడ్డుకున్న పోలీసులు
పార్లమెంట్ లో హిందువులపై రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ బీజేవైఎం ఆధ్వర్యంలో గురువారం గాంధీభవన్ ముట్టడికి యత్నించారు
విధాత : పార్లమెంట్ లో హిందువులపై రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ బీజేవైఎం ఆధ్వర్యంలో గురువారం గాంధీభవన్ ముట్టడికి యత్నించారు. హిందువులు దేశంలో హింస ప్రొత్సహిస్తున్నారన్న రాహుల్ చేసిన వ్యాఖ్యలపై వెంటనే క్షమాపణలు చెప్పాలని తెలంగాణ బీజేవైఎం డిమాండ్ చేస్తూ గాంధీ భవన్ ముట్టడి చేపట్టింది. బీజేపీ రాష్ట్ర కార్యాలయం నుంచి ర్యాలీగా గాంధీ భవన్ వైపు వెళ్తున్న బీజేవైఎం నేతలను పోలీసులు అడ్డుకున్నారు.
లోక్ సభ లో రాహుల్ గాంధీ హిందువులపై చేసిన అనుచిత, అవమానకర వ్యాఖ్యలను ఖండిస్తూ .. తెలంగాణ బిజెవైఎం రాష్ట్ర అధ్యక్షులు శ్రీ @mahendersevalla గారి ఆధ్వర్యంలో నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ వద్ద ఆందోళన కార్యక్రమం చేపట్టిన నాయకులు, కార్యకర్తలు.
హిందువుల మనోభావాలను దెబ్బతీసే వ్యాఖ్యలను… pic.twitter.com/Fy6d02Qc8G
— BJP Telangana (@BJP4Telangana) July 4, 2024
ఈ క్రమంలో అక్కడ తోపులాట నెలకొంది. బీజేవైఎం యువమోర్చా రాష్ట్ర అధ్యక్షుడు ఆధ్వర్యంలో రాహుల్ గాంధీ అంతిమయాత్ర దిష్టి బొమ్మ దహనం చేశారు. రోడ్డుపై బైఠాయించి రాహుల్ గాంధీ ముర్దాబాద్ అంటూ నిరసన వ్యక్తం చేశారు. అనంతరం మరోసారి గాంధీ భవన్ వైపు దూసుకెళ్లే ప్రయత్నం చేయడంతో పోలీసులు ఆందోళన కారులను అరెస్ట్ చేసి స్థానిక పోలీస్ స్టేషన్లకు తరలించే క్రమంలో పరిస్థితులను అదుపు చేసేందుకు పోలీసులు బీజేవైఎం నేతలపై లాఠీ ఛార్జ్ చేశారు. ఈ సందర్భంగా కొంత ఉద్రిక్తత నెలకొంది.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram