ఘనంగా బోనాల పండుగ నిర్వహిస్తాం:మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి,తలసాని

విధాత‌: గతసంవత్సరం కరోనా కారణంగా నిరాడంబరంగా జరిగిన ఆషాఢం బోనాల జాతరను ఈసారి ఘనంగా నిర్వహిస్తామని దేవాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, హోం మంత్రిమహమూద్అలీ, కార్మికశాఖ మంత్రి మల్లారెడ్డి పేర్కొన్నారు. ఈ మేరకు శుక్రవారం బోనాల పండుగలకు విస్తృత ఏర్పాట్ల పై ఉన్నతాధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. అనంతరం మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. ఈ సారి జాతరలో కోవిడ్ మార్గదర్శకాలను పాటించాలని, పోలీస్ లతో సహకరించాలని ప్రజలకు […]

ఘనంగా బోనాల పండుగ నిర్వహిస్తాం:మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి,తలసాని

విధాత‌: గతసంవత్సరం కరోనా కారణంగా నిరాడంబరంగా జరిగిన ఆషాఢం బోనాల జాతరను ఈసారి ఘనంగా నిర్వహిస్తామని దేవాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, హోం మంత్రిమహమూద్అలీ, కార్మికశాఖ మంత్రి మల్లారెడ్డి పేర్కొన్నారు. ఈ మేరకు శుక్రవారం బోనాల పండుగలకు విస్తృత ఏర్పాట్ల పై ఉన్నతాధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. అనంతరం మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. ఈ సారి జాతరలో కోవిడ్ మార్గదర్శకాలను పాటించాలని, పోలీస్ లతో సహకరించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. బోనాలను విజయవంతం చేసేందుకు అధికారులు సమిష్టిగా పని చేయాలని వారు కోరారు.హైదరాబాద్ కు తలమానికంగా నిలిచే బోనాల పండుగను ఘనంగా నిర్వహించేందుకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తోందని మంత్రులు తెలిపారు.తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి ప్రతి ఏటా బోనాల ఉత్సవాలు ఎంతో వైభవంగా నిర్వహిస్తున్నామ‌ని, కరోనా కారణంగా గత ఏడాది బోనాల ఉత్సవాలను నిర్వహించలేదని, అయితే ఈ సంవత్సరం కోవిడ్ మార్గదర్శకాల మేరకు బోనాల సంబ‌రాల‌ను జ‌రుపుకునేలా అన్నిశాఖల అధికారుల సమన్వయంతో విస్తృత ఏర్పాట్లు చేయాలన్నారు. బోనాలు జరిగే అన్ని దేవాలయాలను విద్యుత్ దీపాలతో అలంకరించాలని, రహదారులను శుభ్రంగా ఉండేలా చూడాలని, మంచినీటి సౌకర్యం కల్పించాలని అధికారుల‌ను ఆదేశించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాల‌న్నారు.జీహెచ్ఎంసీతో పాటు ఇత‌ర శాఖ‌ల అధికారుల‌తో స‌మ‌న్వ‌యం చేసుకుంటూ.. విజ‌య‌వంతంగా బోనాల ఉత్స‌వాల‌ను నిర్వ‌హించాల‌న్నారు. గంగ, జమున, తెహజీబ్ సంస్కృతికి నిల‌య‌మైన‌ హైద‌రాబాద్ న‌గ‌రంలో అందరూ ప్రశాంతంగా బోనాలు నిర్వహించుకోవాలని, పోలీస్ యంత్రాంగానికి సహకరించాలని కోరారు. కాగా జూలై 11న గోల్కొండ జగదాంబ మహాంకాళి అమ్మవారికి తొలిబోనం స‌మ‌ర్పించ‌డంతో ఉత్స‌వాలు ప్రారంభం కానున్నాయి. ఉజ్జయిని మహంకాళి దేవాలయం సికింద్రాబాద్ వద్ద జూలై 25 న బోనాలు, జూలై 26న రంగము నిర్వహిస్తారు.హైదరాబాద్ లాల్ దర్వాజ మహంకాళి అమ్మవారికి ఆగష్టు 1న బోనాల పండుగను, అ మరుసటి రోజు బోనాల ఉరేగింపును నిర్వహిస్తారు. ఈ సమీక్ష సమావేశంలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ లు, డీజీపీ మహేందర్ రెడ్డి, మేయర్ విజయలక్ష్మి, దేవాదాయ శాఖ కమిషనర్ అనిల్ కుమార్, హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ సీపీలు, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.