రేవంత్‌కు అందుకే నాపై క‌క్ష‌.. కేసీఆర్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఓటుకు నోటు విష‌యంలోనే త‌న‌పై క‌క్ష పెంచుకొని ఉండొచ్చ‌ని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. టీవీ9 బిగ్ డిబేట్‌లో కేసీఆర్ ఈ అంశంపై మాట్లాడారు.

రేవంత్ రెడ్డికి త‌న మీదున్న‌ది కోపం అనుకోవ‌డం లేదు. అది ఒక‌ర‌మైన అజ్ఞాన తిమిరం. తెలంగాణ‌ను ఆగం చేయాల‌ని చెప్పి, ఆంధ్రా తెలంగాణ క‌ల‌పాల‌ని చెప్పి.. ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో ఓటుకు నోటు విష ప్ర‌యోగం జ‌రిగింది. రూ. 50 ల‌క్ష‌ల‌తో నామినెటేడ్ ఎమ్మెల్యే స్టీఫెన్ స‌న్‌కు ఇస్తూ రెడ్ హ్యాండెడ్‌గా ప‌ట్టుబ‌డ్డారు. ఈ కేసు పుప్రీంకోర్టులో ఉంది. దానిపై కోపంతో తప్ప రేవంత్ రెడ్డికి తనపై కక్ష ఇంకేం ఉంటుందన్నారు. అంతకుమించి తమ మధ్య ఏమీ లేదన్నారు కేసీఆర్.

ఇంకా రేవంత్ మాట్లాడుతూ కేసీఆర్ ఆన‌వాళ్లు చెరిపేస్తా అన్నారు. అలా అయితే స‌చివాల‌యం, ఎమ్మెల్యే క్వార్ట‌ర్స్, యాదాద్రి, గురుకులాలు, ప్రాజెక్టుల‌న్నీంటిని చెరిపేయాలి. మొత్తానికి తెలంగాణ ఎడారి కావాల‌ని రేవంత్ రెడ్డి అనుకుంటున్నారని కేసీఆర్ తెలిపారు.