HCU: సుప్రీంకోర్టు కమిటీతో.. BRS బృందం భేటీ

విధాత: HCU కంచ గచ్చిబౌలి భూముల వివాదంపై క్షేత్ర స్థాయి పరిశీలనకు సుప్రీంకోర్టు నియమించిన పర్యావరణ, అటవీ శాఖల సాధికారిక కమిటీతో బీఆర్ఎస్ నేత హరీశ్ రావు బృందం భేటీ అయ్యింది. తాజ్ కృష్ణాలో చైర్మన్ సిద్దాంత దాస్ నేతృత్వంతోని కమిటీ సభ్యులతో హరీశ్ రావు బృందం సమావేశమైంది.
కంచ గచ్చిబౌలి భూములపై నివేదిక సమర్పించారు. డాక్యుమెంట్లు, విజువల్స్‌ను కమిటీకి సమర్పించారు. అనంతరం ముగ్గురు సభ్యుల సుప్రీంకోర్టు కమిటీ కంచ గచ్చిబౌలి భూముల పరిశీలనకు వెళ్లింది. తిరిగి మధ్యాహ్నం ప్రభుత్వ ఉన్నతాధికారులతో సమావేశమైంది. కమిటీ ఈ నెల 16లోగా సుప్రీంకోర్టుకు నివేదిక ఇవ్వనుంది.
కమిటీతో భేటీ అనంతరం హరీష్ రావు మాట్లాడుతూ కంచ గచ్చిబౌలి భూముల వ్యవహారంలో ప్రభుత్వం కంచె చేను మేసిన చందంగా అడవి, వన్యప్రాణులను రక్షించాల్సిందిపోయి వాటి విధ్వంసానికి పాల్పడిందని కమిటీకి ఫిర్యాదు చేశామన్నారు. ప్రభుత్వం అటవీ, వన్యప్రాణి, వాల్టా చట్టాలను ఉల్లంఘిందని తెలిపారు. ఒక్క చెట్టు కొట్టాలన్నా అనుమతి తీసుకోవాలని, అలాంటిది వేలాది చెట్లను ఒకేసారి 50 బుల్డోజర్లను పెట్టి ఊచకోత కోశారన్నారు.
ప్రభుత్వ చర్యలతో 3 జింకలు చనిపోయాయనని, ఒక్క జింకను చంపినందుకు సల్మాన్ ఖాన్ ను జైలులో పెట్టారని, 3 జింకల చావుకు సీఎం రేవంత్ రెడ్డి కారణం కాదా అని హరీష్‌రావు ప్రశ్నించారు. పేదవాడు ఒక్క చెట్టు కొడితే కేసులు పెడతారని, పట్టాభూమిలో చెట్టు కొట్టాలంటే కూడా అనుమతి అవసరమని గుర్తు చేశారు. అలాంటిది ప్రభుత్వం ఎలాంటి అనుతులు తీసుకోకండా.. వేలాది చెట్లను కొట్టేసిందిని వీటిన్నింటిని కమిటీకి నివేదించామన్నారు.