KCR ఫామ్ హౌస్‌లో.. BRS రజతోత్సవాల సన్నాహాక భేటీ

KCR ఫామ్ హౌస్‌లో.. BRS రజతోత్సవాల సన్నాహాక భేటీ

విధాత: బీఆర్ఎస్ పార్టీ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ తన ఎర్రవెల్లి ఫామ్ హౌస్ లో పార్టీ ముఖ్యనేతలతో కీలక భేటీ నిర్వహించారు. ఏప్రిల్ 27న బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ రజతోత్సవాలు నిర్వహించనున్న నేపథ్యంలో ఇందుకు సంబంధించిన సన్నాహాలపై ఈ భేటీలో వారు చర్చించారు.

తాజా రాజకీయ పరిణామాలపై చర్చించారు. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థి ఎంపికపై చర్చ సాగింది. ఏప్రిల్‌ 27న బీఆర్‌ఎస్‌ ఆవిర్భావ దినోత్సవం పురస్కరించుకుని భారీ బహిరంగసభకు కేసీఆర్‌ నిర్ణయించారు. ఏప్రిల్‌ 10న హైదరాబాద్‌లో బీఆర్ఎస్ ప్రతినిధుల సమావేశం జరుపాలని నిర్ణయించారు.

సిల్వర్‌ జూబ్లీ పేరుతో హైదరాబాద్‌ లేదా.. వరంగల్‌లో బహిరంగ సభకు ప్రణాళికలపై కేసీఆర్ నాయకులతో చర్చించారు. అలాగే బీసీ రిజర్వేషన్లు, ఎస్సీ వర్గీకరణ, బిల్లులపైన, బడ్జెట్ పైన అసెంబ్లీ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై ఎమ్మెల్యేలకు కేసీఆర్ దిశానిర్దేశం చేశారు.