కరీంనగర్ లో బీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ..తీవ్ర ఉద్రిక్తత

కరీంనగర్ కేంద్రంలో బీఆర్ఎస్, బీజేపీ శ్రేణుల మధ్య ఘర్షణ వాతావరణ నెలకొనడంతో తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నాయి. మాజీ మంత్రి, ఎమ్మెల్యే గంగుల కమలాకర్ క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి కేంద్ర మంత్రి బండి సంజయ్ పై విమర్శలు చేయడంతో రెచ్చిపోయిన బీజేపీ శ్రేణులు క్యాంపు కార్యాలయంపై దాడి చేసి ఫర్నిచర్ ధ్వంసం చేశారు.

కరీంనగర్ కేంద్రంలో బీఆర్ఎస్, బీజేపీ శ్రేణుల మధ్య ఘర్షణ వాతావరణ నెలకొనడంతో తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నాయి. మాజీ మంత్రి, ఎమ్మెల్యే గంగుల కమలాకర్ క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి కేంద్ర మంత్రి బండి సంజయ్ పై విమర్శలు చేయడంతో రెచ్చిపోయిన బీజేపీ శ్రేణులు క్యాంపు కార్యాలయంపై దాడి చేసి ఫర్నిచర్ ధ్వంసం చేశారు. కౌశిక్ రెడ్డి కారును ధ్వంసం చేయగా.. పోలీసులు బీజేపీ శ్రేణులను చెదరగొట్టారు. పాడి కౌశిక్ రెడ్డి ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ బండి సంజయ్ తంబాకులో డ్రగ్స్ కలపడంతోనే ఆయనకు బట్టతల వచ్చిందని ఆరోపించారు.

కేటీఆర్ పై మీరు నోటికి వచ్చినట్లు మీరు మాట్లాడితే మేము మాట్లాడ్తాం.. నువ్వు మగాడివైతే అని మేము అనగలం.. గతంలో భార్య పుస్తే అమ్మి ఎన్నికల్లో పోటీ చేశారని చెప్పిన బండి సంజయ్ కరీంనగర్ కార్పోరేషన్ ఎన్నికల్లో రూ.50కోట్లు ఎలా ఖర్చు పెట్టారని కౌశిక్ రెడ్డి ప్రశ్నించారు. అదంతా అవినీతి సొమ్ము అని ఆరోపించారు.  కరీంనగర్ కు బీజేపీ, బండి సంజయ్ లు చేసిందేమి లేదన్నారు. అభివృద్దిపై చర్చకు రావాలని సవాల్ విసిరారు.  దీంతో ప్రెస్ మీట్ జరుగుతుండగానే.. బీజేపీ శ్రేణులు భారీ సంఖ్యలో అక్కడికి చేరుకుని దాడికి దిగారు.

అంతకుముందు తనపై కేటీఆర్ చేసిన అవినీతి ఆరోపణలపై బండి సంజయ్ పై మండిపడ్డారు. కేసీఆర్ కు పుడితే కేటీఆర్ నాపై చేసిన ఆరోపణలను నిరూపించాలని, డ్రగ్స్ తీసుకుని అడ్డగోలుగా మాట్లాడటం కాదన్నారు. రేవంత్ రెడ్డితో కలిసి రాహు, కేతువులుగా మారిపోయారన్నారు. ఫోన్ ట్యాపింగ్, డ్రగ్స్, ఫామ్ హౌస్, విద్యుత్తు కొనుగోలు, ఫార్ములా ఈ కార్ కేసు, కాళేశ్వరం కేసులు అన్ని ఎక్కడ పోయాయని ప్రశ్నించారు. ఎందుకు ఆ కేసుల్లో రేవంత్ ఇప్పటిదాకా కేటీఆర్ ను అరెస్టు చేయలేదని, మీ దోస్తానా మాకు తెల్వదా అంటూ మండిపడ్డారు. బండి వ్యాఖ్యలకు కౌంటర్ గా పాడి కౌశిక్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు వివాదాన్ని మరింత రాజేసి ఉద్రిక్తతలకు కారణమయ్యాయి.

బీఆర్ఎస్ ఎదురుదాడి

గంగుల కమలాకర్ క్యాంప కార్యాలయం దాడి ఘటన సమాచారంతో బీఆర్ఎస్ శ్రేణులు చుట్టుప్రక్కల ప్రాంతాల నుంచి భారీగా అక్కడికి చేరుకున్నాయి. బీజేపీ దాడిని నిరసిస్తూ ప్రతిగా నిరసనకు దిగారు. దీంతో స్థానికంగా తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నాయి. గంగుల క్యాంపు కార్యాలయంలో ఉన్న కౌశిక్ రెడ్డిని అక్కడి నుంచి వెళ్లిపోవాలని పోలీసులు కోరగా..ఆయన అందుకు నిరాకరించారు. మరోవైపు బీజేపీ, బీఆర్ఎస్ శ్రేణులు మోహరింపుతో పరిస్థితి మరింత ఉద్రిక్తతంగా మారవచ్చన్న ఆందోళనతో పోలీసు బలగాలను భారీగా అక్కడికి తరలించారు.

 

ఇవి కూడా చదవండి :

Chandranath Rath | సువేందు అధికారి పీఏ దారుణ హ‌త్య‌.. ఎవ‌రీ చంద్ర‌నాథ్ ర‌థ్‌..?
రాహుల్, రేవంత్ పై కేటీఆర్ ఫైర్.. కేటీఆర్ పై భగ్గుమన్న పీసీసీ చీఫ్

Latest News