Devara Movie | జూ. ఎన్టీఆర్ దేవర ప్రీ రిలీజ్ రద్దు.. రేవంత్ అసమర్థతనే కారణమన్న కేటీఆర్
Devara Movie | టాలీవుడ్ హీరో జూనియర్ ఎన్టీఆర్( Jr NTR ) నటించిన దేవర మూవీ( Devara Movie ) ఈ నెల 27వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. అయితే మూడు రోజుల క్రితం హైదరాబాద్ నోవాటెల్ హోటల్( Novotel Hotel )లో ఏర్పాటు చేసిన దేవర ప్రీ రిలీజ్ వేడుక( Devara Pre Release Event )ను పోలీసులు అర్ధాంతరంగా రద్దు చేసిన సంగతి తెలిసిందే. ఇది రేవంత్ సర్కార్( Revanth Govt ) అసమర్థతనే అని కేటీఆర్( KTR ) అన్నారు.

Devara Movie | జూనియన్ ఎన్టీఆర్( Jr NTR ) నటించిన దేవర ప్రీ రిలీజ్( Devara Pre Release ) రద్దుపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్( KTR ) తొలిసారి స్పందించారు. జూనియర్ ఎన్టీఆర్ సినిమా దేవర ప్రీ రిలీజ్ వేడుక పెట్టుకుంటే దాన్ని కూడా చక్కగా నిర్వహించలేని అసమర్థత ఈ రాష్ట్ర ప్రభుత్వానిది, రేవంత్ రెడ్డి( Revanth Reddy )ది అని కేటీఆర్ పేర్కొన్నారు. ఫతే నగర్‌లో ఎస్టీపీని పరిశీలించిన అనంతరం కూకట్‌పల్లిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కేటీఆర్ ఈ వ్యాఖ్యలు చేశారు.
కేటీఆర్ ఏమన్నారంటే..?
హైదరాబాద్( Hyderabad ) నగరాన్ని ఒక మహానగరంగా తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో ప్రతి పండుగకు ఆనాటి మంత్రులు, అధికారులు సమన్వయంతో కలిసి పని చేశారు. చిన్నపాటి శాంతి భద్రత( Law and Order ) సమస్యలు తలెత్తకుండా అన్ని పండుగలను శాంతియుతంగా నిర్వహించారు. ఎక్కడా కూడా ట్రాఫిక్‌కు అంతరాయం కలగకుండా ఫార్ములా రేస్, గణేశ్ నిమజ్జనం, మొహర్రం ఊరేగింపు, బోనాల పండుగ కావొచ్చు.. ఏదైనా శాంతియుతంగా చేసినం. చివరికి సినిమాలకు జరిగే ప్రీ రిలీజ్ ఈవెంట్లకు కూడా జాగ్రత్తగా చర్యలు తీసుకునే వాళ్లం. ఆ ఘనత మా బీఆర్ఎస్ ప్రభుత్వానికే దక్కింది. కానీ ఇవాళ హైదరాబాద్ నగరంలో ఏం జరుగుతుందో మీరే చూడండి.. నిన్న జూనియర్ ఎన్టీఆర్ సినిమా దేవర ప్రీ రిలీజ్ వేడుక పెట్టుకుంటే దాన్ని కూడా చక్కగా నిర్వహించలేని అసమర్థత ఈ రాష్ట్ర ప్రభుత్వానిది. అలాంటి పరిస్థితుల్లోకి ఈ నగరం వెళ్లిపోయింది. ఇంకో వైపు ట్రాఫిక్ సమస్య తీవ్రంగా మారింది. గతంలో ట్రాఫిక్ మేనేజ్‌మెంట్ ఎట్ల ఉండే.. ఇప్పుడు ఎట్ల ఉందో ప్రజలందరికీ తెలుసు. గంటలు గంటలు ట్రాఫిక్‌లో ఇరుక్కుపోయే పరిస్థితి వచ్చింది అని కేటీఆర్ పేర్కొన్నారు.
Jr ఎన్టీఆర్ దేవర సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా సరిగ్గా నిర్వహించడానికి రాలేదు ఈ అసమర్ధత ప్రభుత్వానికి – కేటీఆర్ pic.twitter.com/0I8CGXVEjt
— Telugu Scribe (@TeluguScribe) September 25, 2024