Hyderabad | బోరబండలో యువకుడి హత్య

బోరబండ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ యువకుడు హత్యకు గురయ్యాడు. కార్మిక నగర్ ప్రధాన రహదారి ప్రక్కన ఉన్న నిమ్స్ మైదానంలో యువకుడు మృతి చెంది ఉండటాన్ని బుధవారం స్థానికులు గమనించారు.

Reported by: Somu | తెలంగాణ‌ | Aug 01, 2025, 10:58 pm IST
Read Time: 2 mins
Hyderabad | బోరబండలో యువకుడి హత్య

విధాత, హైదరాబాద్ : బోరబండ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ యువకుడు హత్యకు గురయ్యాడు. కార్మిక నగర్ ప్రధాన రహదారి ప్రక్కన ఉన్న నిమ్స్ మైదానంలో యువకుడు మృతి చెంది ఉండటాన్ని బుధవారం స్థానికులు గమనించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు. క్లూస్ టీమ్స్ పరిశోధన సాగుతుంది. మృతుడి చేతిలో ఉన్న సెల్‌ఫోన్ ఆధారంగా పోలీసులు విచారణ చేస్తున్నారు. ఎస్‌ఆర్ నగర్ ఏసీపీ వెంకటరమణ, బోరబండ ఎస్సై వీరశంకర్‌లు కేసు దర్యాప్తు చేస్తున్నారు. మృతుడి వివరాలు తెలియాల్సివుంది.