TELANGANA | బడ్జెట్ సన్నాహకం అధికారులతో సీఎస్ భేటీ
ఈ నెల 23 నుంచి ప్రారంభం కానున్న తెలంగాణ శాసన సభ బడ్జెట్ సమావేశాలకు సంబంధించి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించారు.

విధాత, హైదరాబాద్ : ఈ నెల 23 నుంచి ప్రారంభం కానున్న తెలంగాణ శాసన సభ బడ్జెట్ సమావేశాలకు సంబంధించి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించారు. శాసనసభ్యులు లేవనెత్తే అన్ని ప్రశ్నలకు త్వరితగతిన పూర్తి సమాచారంతో సమాధానాలు పంపాలని ఆమె అధికారులను ఆదేశించారు. బడ్జెట్ సెషన్‌లో సమన్వయ లోపం లేకుండా చూసేందుకు సీనియర్ అధికారులు తప్పనిసరిగా హాజరు కావాలని సీఎస్ ఆదేశించారు. రాష్ట్ర వార్షిక బడ్జెట్‌ను ఈ నెల 25న ప్రవేశపెట్టనున్నట్లు ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కే రామకృష్ణారావు తెలిపారు. తదుపరి రోజుల్లో వివిధ శాఖల డిమాండ్లపై చర్చ జరగనుందని, నోట్ ఆన్ డిమాండ్ రూపొందించి బడ్జెట్‌ను సిద్ధంగా ఉంచాలన్నారు. ఈ సమావేశంలో ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కే. రామకృష్ణారావు, ముఖ్య కార్యదర్శులు సందీప్‌కుమార్ సుల్తానియా, నవీన్ మిట్టల్, శైలజా రామయ్యర్, కార్యదర్శులు రఘునందన్‌రావు, బుద్ధ ప్రకాష్ జ్యోతి, వి కరుణ, లోకేష్ కుమార్, సిఐపిఆర్ హనుమంతరావు, ఇతర అధికారులు పాల్గొన్నారు. కాగా ఈ నెల 23న ఉదయం 11 గంటలకు శాసనసభ ప్రారంభం కానుంది. సభ ప్రారంభమైన వెంటనే ఉభయసభలను ఉద్దేశించి గవర్నర్ సీపీ రాధాకృష్ణన్ ప్రసంగం చేయనున్నారు. ఇక మండలి సమావేశాలు 24వ తేదీన ప్రారంభం కానున్నాయి. ఇందుకు సంబంధించి అసెంబ్లీ సెక్రటరీ ప్రకటన విడుదల చేశారు.