తెలంగాణలో మంత్రివర్గ విస్తరణ, సీతక్కకు హోంశాఖ … మంత్రి దామోదర రాజనర్సింహ చిట్‌చాట్
త్వరలోనే తెలంగాణ మంత్రివర్గ విస్తరణ ఉంటుందని రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. ఆయన సోమవారం మీడియాతో చిట్‌చాట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పలువురి మంత్రుల శాఖలు సైతం మారే అవకాశాలున్నాయన్నారు
విధాత : త్వరలోనే తెలంగాణ మంత్రివర్గ విస్తరణ ఉంటుందని రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. ఆయన సోమవారం మీడియాతో చిట్‌చాట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పలువురి మంత్రుల శాఖలు సైతం మారే అవకాశాలున్నాయన్నారు. సీతక్కకు హోంమంత్రి పదవి ఇచ్చే అవకాశం ఉందన్నారు. రాజగోపాల్‌రెడ్డి, దానం నాగేందర్, నిజామాబాద్ నుంచి ఒకరికి మంత్రివర్గంలో స్థానం లభించే అవకాశం ఉందన్నారు. రాజకీయాలు పరిస్థితులను బట్టి మారుతుంటాయన్నారు. 2018 ఎన్నిలకు ముందు ప్యారాచూట్లకు టికెట్లు లేవని రాహుల్ గాంధీ చెప్పారని.. కానీ పరిస్థితుల దృష్ట్యా టికెట్ల కేటాయింపు జరిగిందన్నారు. త్వరలో వైద్యశాఖలో ప్రక్షాళన, సంస్కరణలు తీసుకువస్తామన్నారు. వైద్యశాఖలో రెండే విభాగాలు ఉండాలన్నారు. ఇందులో ఒకటి అడ్మినిస్ట్రేషన్, రెండు ఎడ్యుకేషన్ అన్నారు. దామోదర రాజనర్సింహ్మ తన చిట్‌చాట్‌లో చెప్పిన మాటల్లో రాజగోపాల్‌రెడ్డి ఆశిస్తున్న హోంశాఖ సీతక్కకు దక్కనుందని, కేబినెట్ విస్తరణతో పాటు మంత్రుల శాఖలు మారుతాయని, పార్టీలు మారిన వారికి మంత్రి పదవులు దక్కవచ్చన్న వ్యాఖ్యలు ఉండటం పోలిటికల్ సర్కిల్‌గా హాట్ టాపిక్‌గా మారాయి.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram