17, 46 జీవోలపై క్యాబినెట్ సబ్ కమిటీ సమీక్ష.. కీలక నిర్ణయాలివే.

తెలంగాణలో కొత్త జోన్లు, కొత్త జిల్లాలకు అనుగుణంగా ఉద్యోగుల సర్దుబాటు కోసం ఉద్దేశించిన జీవో నెంబర్ 317, 46 జీవోలపై ప్రభుత్వం ఏర్పాటు చేసిన క్యాబినెట్ సబ్ కమిటీ బుధవారం భేటీ అయింది. మంత్రులు దామోదర రాజనర్సింహ, పొన్నం ప్రభాకర్, శ్రీధర్ బాబు ల తో కూడిన కమిటీ జీవో 317 జీవో 46 పై చర్చించింది

17, 46 జీవోలపై క్యాబినెట్ సబ్ కమిటీ సమీక్ష.. కీలక నిర్ణయాలివే.

విధాత : తెలంగాణలో కొత్త జోన్లు, కొత్త జిల్లాలకు అనుగుణంగా ఉద్యోగుల సర్దుబాటు కోసం ఉద్దేశించిన జీవో నెంబర్ 317, 46 జీవోలపై ప్రభుత్వం ఏర్పాటు చేసిన క్యాబినెట్ సబ్ కమిటీ బుధవారం భేటీ అయింది. మంత్రులు దామోదర రాజనర్సింహ, పొన్నం ప్రభాకర్, శ్రీధర్ బాబు ల తో కూడిన కమిటీ జీవో 317 జీవో 46 పై చర్చించింది. గత ప్రభుత్వ హయాంలో ఆ జీవోలకు వ్యతిరేకంగా ఉపాధ్యాయులు, ఉద్యోగులు ఆందోళనకు దిగారు. స్థానికత అనే అంశాన్ని విస్మరించి సీనియారిటీకి పెద్ద పీట వేశారంటూ ఆందోళన చేపట్టారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు కాంగ్రెస్ ప్రభుత్వం ఆ జీవోలను సమీక్షించేందుకు కేబినెట్ సబ్ కమిటీ నియమించింది. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలను సబ్ కమిటీ ప్రకటించింది.

ఈ కమిటీ సమావేశంలో దరఖాస్తులు చేసుకునే ఉద్యోగులకు జూన్ – 14 నుండి జూన్ – 30వ తేదీ వరకు అవకాశం కల్పించారు. వెబ్‌సైట్‌ ద్వారా దరఖాస్తులను లోకల్ స్టేటస్ ఆప్షన్ ఇచ్చారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల భార్య/భర్త లకు కూడా ఆప్షన్ ఇచ్చారు. మల్టిపుల్ అప్లికేషన్లకు దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించారు. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకున్న ఉద్యోగులకు రసీదు ఇస్తారు. ఇప్పటివరకు 12 వేల 11 దరఖాస్తులను ఆన్‌లైన్‌లో స్వీకరించారు. వీటికి రీవెరిఫికేషన్‌ అవకాశం కల్పిస్తూ సబ్‌ కమిటీ నిర్ణయం తీసుకున్నది. ఉద్యోగులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకున్న తర్వాత ఆ దరఖాస్తు స్టేటస్ ను వారి సెల్ ఫోన్ కు మెసేజ్‌ రూపంలో తెలియజేస్తారు. ఈ సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారులు శివశంకర్, రఘునందన్ రావు, జిఏడి అధికారులు పాల్గొన్నారు.