CBI Director Praveen Sood : సీబీఐ డైరక్టర్ ప్రవీణ్ సూద్ కు అస్వస్థత

హైదరాబాద్‌లో సీబీఐ డైరెక్టర్ ప్రవీణ్ సూద్ అకస్మాత్తుగా అస్వస్థతకు గురై అపోలో ఆసుపత్రిలో చేరారు. వైద్యులు ఆరోగ్యం నిలకడగా ఉందని తెలిపారు.

CBI Director Praveen Sood : సీబీఐ డైరక్టర్ ప్రవీణ్ సూద్ కు అస్వస్థత

విధాత, హైదారాబాద్ : హైదరాబాద్ వచ్చిన సీబీఐ డైరక్టర్ ప్రవీణ్ సూద్(Praveen Sood) అకస్మాత్తుగా అస్వస్థతకు గురయ్యారు. ఈరోజు ఉదయం శ్రీశైలం(Srisailam) నుంచి హైదరాబాద్‌కు చేరుకున్న ప్రవీణ్ సూద్ జూబ్లీహిల్స్‌లోని సీబీఐ గెస్ట్ హౌస్‌లో తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఆ వెంటనే సిబ్బంది ఆయనను జూబ్లీహిల్స్(JublieHills)  అపోలో ఆసుపత్రికి(Apollo Hospitals) తరలించారు. ప్రస్తుతం ఆయనకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు.

ప్రవీణ్ సూద్(Praveen Sood) ఆరోగ్యం నిలకడగానే ఉందని వైద్యులు తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) అక్రమాలపై సీబీఐ దర్యాప్తుకు తెలంగాణ(Telangana) ప్రభుత్వం సిఫారసు చేసిన నేపథ్యంలో ఆయన హైదరాబాద్(Hyderabad) కు వచ్చారు. ఇంతలోనే ఆయన అస్వస్థతకు గురయ్యారు.