DSC Results | నేడు తెలంగాణ డీఎస్పీ ఫలితాలు.. ప్రకటించనున్న సీఎం రేవంత్‌

DSC Results | ఉపాధ్యాయుల పోస్టుల భర్తీకి నిర్వహించిన డీఎస్పీ-2024 ఫలితాలు సోమవారం వెలువడనున్నాయి. ఫలితాలను సీఎం రేవంత్‌రెడ్డి మరికొద్దిగంటల్లో విడుదల చేయనున్నారు. అంబేద్కర్‌ సచివాలయంలో ఉదయం 11 గంటలకు సీఎం రేవంత్‌ ఫలితాలను ప్రకటించనున్నారు.

DSC Results | నేడు తెలంగాణ డీఎస్పీ ఫలితాలు.. ప్రకటించనున్న సీఎం రేవంత్‌

DSC Results | ఉపాధ్యాయుల పోస్టుల భర్తీకి నిర్వహించిన డీఎస్పీ-2024 ఫలితాలు సోమవారం వెలువడనున్నాయి. ఫలితాలను సీఎం రేవంత్‌రెడ్డి మరికొద్దిగంటల్లో విడుదల చేయనున్నారు. అంబేద్కర్‌ సచివాలయంలో ఉదయం 11 గంటలకు సీఎం రేవంత్‌ ఫలితాలను ప్రకటించనున్నారు. ఈ ఏడాది మార్చి ఒకటిన రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 11,062 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసింది. జులై 18 నుంచి ఆగస్టు 5 వరకు డీఎస్పీ పరీక్షలు నిర్వహించింది. దాదాపు 2.45లక్షల మంది పరీక్షలకు హాజరయ్యారు. పరీక్షలు ముగిసిన 56 రోజుల సమయంలో ప్రభుత్వం ఫలితాలు విడుదల చేస్తున్నది. ఇప్పటికే డీఎస్సీ ప్రాథమిక కీతో పాటు ఫైనల్‌ కీని విడుదల చేశారు. ఫైనల్‌ కీపై అభ్యర్థుల నుంచి అభ్యంతరాలు సైతం వచ్చాయి. ముఖ్యంగా 12 ప్రశ్నలపై అభ్యంతరాలు వ్యక్తం చేశారు. ఇప్పటికే నిపుణుల కమిటీ విద్యాశాఖకు నివేదిక సమర్పించింది. దీని ఆధారంగా అభ్యంతరాలను పరిష్కరించనున్నారు. ఫలితాలను చూసుకునేందుకు అభ్యర్థులు https://tgdsc.aptonline.in/tgdsc/ వెబ్‌సైట్‌లో సంప్రదించాలని అధికారులు సూచించారు.