విధాత : చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం భార్య రూపాదేవి ఆత్మహత్యకు పాల్పడ్డారు. అల్వాల్ పంచశీల కాలనీలోని ఇంట్లో గురువారం రాత్రి ఉరేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డారు. కుటుంబ సభ్యుల సమాచారం మేరకు పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని పరిశీలించారు. కేసు నమోదు చేసుకొని ఆత్మహత్యకు గల కారణాలపై విచారణ చేపట్టారు. 12 సంవత్సరాల క్రితం రూపదేవిని మేడిపల్లి సత్యం ప్రేమ వివాహం చేసుకున్నారు. రూపాదేవి ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్నారు. పేట్ బషీరాబాద్‌లోని దవేరియా విల్లాస్‌లో సత్యం దంపతులు నివాసం ఉండేవారు. నెల రోజులు క్రితమే అల్వాల్‌లోని పంచశీల కాలనీ రోడ్ నంబర్ 12 కి మారారు. సత్యం, రూపాదేవి దంపతులకు కుమారుడు యోజిత్ (11 ) , కుమార్తె రిషిక శ్రీ (9) ఉన్నారు. భార్య మృతిని తట్టుకోలేక హాస్పిటల్లో ఎమ్మెల్యే సత్యం కూడా స్పృహ తప్పి పడిపోయారు. మంత్రి పొన్నం ప్రభాకర్ సత్యంను పరామర్శించారు. రూపాదేవి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించి పోస్టుమార్టం అనంతరం కుటుంబ సభ్యులకు అందచేశారు. రూపాదేవి ఆత్మహత్యకు అనారోగ్య సమస్యలే కారణమని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. రూపాదేవి గత రెండేండ్లుగా కడుపు నొప్పుతో బాధపడుతున్నట్లు తెలిపారు. ఈ కారణంగానే రెండు రోజులుగా స్కూల్‌కి సెలవు తీసుకుని ఇంట్లోనే ఉంటున్నారని పోలీసులకు తెలిపారు. ఆమె చనిపోయినప్పుడు తాము ఇంట్లోనే ఉన్నట్లు రూపాదేవి తల్లి, కుమారుడు, కుమార్తె పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలంలో పేర్కొన్నారు. ఆసమయంలో ఎమ్మెల్యే సత్యం నియోజకవర్గంలో ఉన్నారని చెప్పారు. కాగా భార్య మృతి వార్త తెలిసుకున్న ఎమ్మెల్యే సత్యం.. రక్తపోటు తగ్గి దవాఖానలో చేరారు.
అయితే ఆమె మృతిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు కుటుంబ సభ్యుల వాంగ్మూలం తీసుకున్నారు. గురువారం రాత్రి.. అయితే గురువారం రాత్రి కడుపులో నొప్పి భరించలేక ఆత్మహత్య చేసుకుంటున్నట్లు భర్త మేడిపల్లి సత్యంకు రూపాదేవి వీడియో కాల్ చేసి చెప్పింది. తాను వస్తున్నానని చెప్పిన సత్యం ఆయన వచ్చేలోగానే తన రూమ్‌కు వెళ్లి ఉరివేసుకున్నట్లు పోలీసులు నిర్ధారించారు.
చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం భార్య ఆత్మహత్య … ఆత్మహత్యకు ముందు భర్తకు ఫోన్
చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం భార్య రూపాదేవి ఆత్మహత్యకు పాల్పడ్డారు. అల్వాల్ పంచశీల కాలనీలోని ఇంట్లో గురువారం రాత్రి ఉరేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డారు. కుటుంబ సభ్యుల సమాచారం మేరకు పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని పరిశీలించారు

Latest News
వర్షాకాల అత్యవసర పరిస్థితిపై వైద్యశాఖ అప్రమత్తం
చిన్న తప్పుతో కోటి రూపాయల అప్పు.. ఏం చేయాలో తెలియక ఆన్లైన్లో సాయం అడిగిన పాతికేళ్ల కుర్రాడు!
Viral Video | మసాజ్ కోసం మావటి దగ్గర మారాం చేసిన ఏనుగు.. క్యూట్ వీడియో వైరల్!
షాకింగ్..ఒకే ట్రాక్‌పై ఎదురెదురుగా వచ్చిన రైళ్లు!
మీనాక్షి రగడ ఎవరి కొంప ముంచుతుంది?
ఫార్మాసిటీకి నేను 17 ఎకరాలు ఇచ్చాను..రద్దు ఖాయం: హరీశ్‌రావు
ఏపీలో 4 రాజ్యసభ స్థానాలు ఏకగ్రీవం
కవిత టీఆర్ఎస్ టైటిల్ పై సీఈసీకి ఫిర్యాదుల వెల్లువ
రాజ్యసభ ఎన్నికల్లో కాంగ్రెస్ కు షాక్..మధ్యప్రదేశ్ లో ముగ్గురు బీజేపీ అభ్యర్థులు ఏకగ్రీవం
ఏఐసీసీ ఉన్నత స్థాయి భేటీలో కీలక నిర్ణయం