Telangana Ties Up With UK | తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు UK సిద్ధం: సీఎం రేవంత్
తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు యుకే సిద్ధం. చెవెనింగ్ స్కాలర్‌షిప్, ఎడ్యుకేషన్-ఫార్మా రంగాల్లో సహకారం అందిస్తామని బ్రిటీష్ హైకమిషనర్ లిండీ కామెరాన్ తెలిపారు.
హైదరాబాద్, సెప్టెంబర్ 18 (విధాత):
UK ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అందించే చెవెనింగ్ స్కాలర్ షిప్ ( Chevening scholarship) కో-ఫండింగ్ ప్రాతిపదికన తెలంగాణ మెరిట్ విద్యార్థులకు అందించేందుకు లిండీ కామెరాన్ అంగీకరించారు. భారత బ్రిటిష్ హైకమిషనర్ లిండీ కామెరాన్ ( Lindy Cameron) తో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జూబ్లీ హిల్స్ నివాసం లో భేటీ అయ్యారు.
ఎడ్యుకేషన్, టెక్నాలజీ సంబంధిత రంగాల్లో సహకారం అందించేందుకు సిద్ధంగా ఉన్నట్లు ముఖ్యమంత్రికి వివరించిన బ్రిటిష్ హైకమిషనర్. UK యూనివర్సిటీలలో చదువుకునే తెలంగాణ విద్యార్థుల సౌకర్యార్థం హైదరాబాద్ నుంచి అక్కడి యూనివర్సిటీలు ఆపరేట్ చేసేలా చూడాలని సీఎం కోరారు.
ఈ సందర్భంగా తెలంగాణలో తీసుకురాబోతున్న కొత్త ఎడ్యుకేషన్ పాలసీ డ్రాఫ్ట్ ను బ్రిటీష్ హైకమిషనర్ కు సీఎం రేవంత్ రెడ్డి వివరించారు. రాష్ట్రంలోని ప్రభుత్వ ఉపాధ్యాయులు, ప్రొఫెసర్లకు ట్రైనింగ్ అందించేందుకు బ్రిటిష్ హైకమిషనర్ సుముఖత వ్యక్తం చేశారు. మూసీ రివర్ ఫ్రంట్ అభివృద్ధిలో బ్రిటీష్ కంపెనీలు భాగస్వాములు కావాలని సీఎం కోరారు.
Gcc, ఫార్మా, నాలెడ్జ్, అకాడమీ విభాగాల్లో పెట్టుబడులకు ముందుకురావాలని వెల్లడించారు. వీటిపై బ్రిటీష్ హైకమిషనర్ సానుకూలంగా స్పందించారు.
ఈ సమావేశంలో డిప్యూటీ హైకమిషనర్ హైదరాబాద్ గారెత్ విన్ ఓవెన్ ( Gareth Wynn Owen), పొలిటికల్ ఎకానమి అడ్వైజర్ నళిని రఘురామన్, సిఎం స్పెషల్ సెక్రటరీ అజిత్ రెడ్డి, విష్ణు వర్ధన్ రెడ్డి హాజరయ్యారు.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram