CM Revanth Reddy | తెలంగాణ రాష్ట్ర గీతాన్ని ఆవిష్కరించిన సీఎం రేవంత్‌రెడ్డి
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకల్లో తెలంగాణ రాష్ట్ర అధికారిక గీతం జయ జయహే తెలంగాణను సీఎం రేవంత్‌రెడ్డి ఆవిష్కరించారు.
భావోద్వేగంతో అందేశ్రీ కన్నీటి భాష్పాలు
విధాత, హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకల్లో తెలంగాణ రాష్ట్ర అధికారిక గీతం జయ జయహే తెలంగాణను సీఎం రేవంత్‌రెడ్డి ఆవిష్కరించారు. గీత రచయిత అందేశ్రీ, సంగీత దర్శకుడు ఎం.ఎం.కీరవాణిలు ఈ వేడుకలకు హాజరయ్యారు. తను రచించిన జయ జయహే తెలంగాణ గీతాన్ని అధికారికంగా ఆవిష్కరించిన సందర్భంగా అందేశ్రీ భావోద్వేగానికి గురై కన్నీటి భాష్పాలు కార్చారు.
తన గీతాన్ని అధికారిక గీతంగా ఆవిష్కరించే ప్రక్రియ బీఆరెస్ ప్రభుత్వ హయాంలో పదేళ్లుగా వాయిదా పడుతూ రావడం..చివరకు సీఎం రేవంత్‌రెడ్డి ప్రభుత్వం ఆ గీతాన్ని అధికారికంగా ఆవిష్కరించడంతో అందేశ్రీ తన గీత ప్రస్థానాన్ని తలుచుకుని భావోద్వేగానికి లోనయ్యారు
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram