CM Revanth Reddy | గవర్నర్ జిష్ణుదేవ్ వర్మకు స్వాగతం పలికిన సీఎం రేవంత్ రెడ్డి
తెలంగాణ నూతన గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ కు శంషాబాద్ విమానాశ్రయంలో సీఎం రేవంత్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి,డీ జీపీ జితేందర్, త్రివిధ దళాల అధికారులు, రాష్ట్ర ప్రభుత్వ సలహా దారు హర్కార వేణుగోపాల్ రావు, ఇతర ఉన్నతాధికారులు ఘన స్వాగతం పలికారు.

విధాత, హైదరాబాద్ : తెలంగాణ నూతన గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ కు శంషాబాద్ విమానాశ్రయంలో సీఎం రేవంత్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి,డీ జీపీ జితేందర్, త్రివిధ దళాల అధికారులు, రాష్ట్ర ప్రభుత్వ సలహా దారు హర్కార వేణుగోపాల్ రావు, ఇతర ఉన్నతాధికారులు ఘన స్వాగతం పలికారు. విమానాశ్రయంలో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ సాయధ దళాల గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం ఆయన రాజ్ భవన కు వెళ్లారు. గవర్నర్‌గా ఆయనతో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి పదవీ ప్రమాణస్వీకారం చేయిస్తారు.