Cold Wave | జర జాగ్రత్త..! నేటి నుంచి 3 రోజుల పాటు వణికించనున్న చలి..!!
Cold Wave | నిన్న మొన్నటి దాకా కుండపోత( Downpour ) వర్షాలతో ఇబ్బందులు ఎదుర్కొన్న రాష్ట్ర ప్రజలకు ఇప్పుడు చలి( Cold Wave ) వెంటాడుతోంది. చలి కాలం( Winter ) ప్రారంభం కావడంతో.. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో అత్యల్ప ఉష్ణోగ్రతలు( Temperatures ) నమోదు అవుతున్నాయి.
Cold Wave | హైదరాబాద్ : నిన్న మొన్నటి దాకా కుండపోత వర్షాలతో ఇబ్బందులు ఎదుర్కొన్న రాష్ట్ర ప్రజలకు ఇప్పుడు చలి వెంటాడుతోంది. చలి కాలం ప్రారంభం కావడంతో.. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. నేటి మూడు రోజుల పాటు అంటే సోమ, మంగళ, బుధవారాల్లో చలి తీవ్రత భారీగా పెరిగే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ అంచాన వేస్తోంది. సాధారణం కన్నా రెండు నుంచి మూడు డిగ్రీల సెల్సియస్ వరకు తక్కువగా నమోదు కానున్నట్లు పేర్కొంది. ఈ క్రమంలో పసిపిల్లలు, వృద్ధులు జాగ్రత్తగా ఉండాలని, వెచ్చని ప్రదేశాలకే పరిమితం కావాలని సూచిస్తుంది.
ఇక శనివారం రాత్రి నుంచి ఆదివారం తెల్లవారుజాము వరకు చాలా ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు తగ్గినట్లు వాతావరణ శాఖ తెలిపింది. పటాన్‌చెరులో 16.8 డిగ్రీల సాధారణ కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదు కావాల్సి ఉండగా 3.6 డిగ్రీలు తగ్గి 13.2 డిగ్రీల సెల్సియస్ నమోదైంది. ఆదిలాబాద్‌లో 1.5 డిగ్రీలు తగ్గి 14.2, మెదక్‌లో 3.5 డిగ్రీలు తగ్గి 14.1, హయత్‌నగర్‌లో 1.2 డిగ్రీలు తగ్గి 15.6, హనుమకొండలో 4.2 డిగ్రీలు తగ్గి 16, హైదరాబాద్‌లో 1.6 డిగ్రీలు తగ్గి 16.9 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
కేవలం రాత్రి ఉష్ణోగ్రతలే కాదు.. పగటిపూట కూడా ఉష్ణోగ్రతలు తగ్గాయి. ఆదివారం రామగుండంలో సాధారణం కన్నా 3 డిగ్రీలు తగ్గి 29 డిగ్రీల సెల్సియస్ గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. నిజామాబాద్‌లో 1.7 డిగ్రీలు తగ్గి 30.2, హైదరాబాద్‌లో 1.3 డిగ్రీలు తగ్గి 29.2 డిగ్రీల సెల్సియస్ నమోదైనట్లు వాతావరణ శాఖ వెల్లడించింది.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram