Jangaon | ధాన్యం కొనుగోలు ఆలస్యం కాకూడదు : కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్
చిల్పూర్ మండలం రాజవరంలో ఏర్పాటు చేసిన ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ మంగళవారం ఆస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్బంగా నిర్వాహకులు రిజిస్టర్ లను సరిగ్గా మెయింటైన్ చేస్తున్నారా లేదా అని కలెక్టర్ చెక్ చేశారు.
విధాత, జనగామ :
చిల్పూర్ మండలం రాజవరంలో ఏర్పాటు చేసిన ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ మంగళవారం ఆస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్బంగా నిర్వాహకులు రిజిస్టర్ లను సరిగ్గా మెయింటైన్ చేస్తున్నారా లేదా అని కలెక్టర్ చెక్ చేశారు. అలాగే, అధికారులకు, నిర్వాహకులకు ఆయన పలు సూచనలు, ఆదేశాలు జారీ చేశారు. ఐకేపీ కేంద్రాలకు వచ్చిన ధాన్యాన్ని ఎప్పటికప్పుడు తేమ శాతాం రాగానే కొనుగోలు చేయాలనీ… వెంటనే ట్యాగ్ చేసిన మిల్లు లకు తరలించాలన్నారు. ధాన్యానికి సంబంధించిన వివరాలను వెంటనే ట్యాబ్ లో ఎంట్రీ చేసి… రైతులకు ఎప్పటికప్పుడు వారి ఖాతా లోకి నగదు జమ అయ్యేలా చూడాలని సూచించారు. ఇప్పటివరకు 1644 మంది రైతులకు 3.21 కోట్ల రూపాయల బోనస్ డబ్బులు క్రెడిట్ అయ్యయని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో మండల తహసీల్దార్, కొనుగోలు కేంద్ర నిర్వాహకులు, తదితరులు పాల్గొన్నారు.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram